మా అబ్బాయి సంహీత్ రెడ్డి ఒక సంవత్సరం పదకొండు నెలలకు అబ్బాయికి ఆటిజం అని డయాగ్నోసిస్  చేసి చెప్పడం జరిగింది, అప్పటివరకు మాకు ఆటిజం అంటే ఏమిటో కూడా తెలియదు, చిన్నపిల్లలకు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయనికూడా తెలియదు, ఆసుపత్రి వారు దాదాపు 400 పేజీల పైగా ఉన్న అమెరికన్ సి డి సి వారి ఆటిజం గురించిన డాక్యుమెంట్ ను ఇచ్చారు, ఆ డాక్యుమెంట్ చదువుతూ ఆటిజం గురించి తెలుసుకున్న కొద్దీ దుఃఖం ఆగ లేదు, ఎంత తెలుసుకుంటే అంత భయమేసింది, బాధ కలిగింది, భయమని మాట ఎందుకు అన్నానంటే 1995 లో 500 మంది పిల్లలలో ఒక్కరికి ఆటిజం వస్తే 2019 నాటికి 32 మంది పిల్లలలో ఒక్కరికి ఆటిజం కండిషన్ వస్తుంది,  గత ముప్పై సంవత్సరాలుగా  అస్సలు ఆటిజం ఎందుకువస్తుందో కారణం కూడా కనిపెట్టలేకపోయారు శాస్త్రవేత్తలు.

 

మా అబ్బాయిని దాదాపు 15 రోజులు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆటిజం సంబంధించిన లక్షణాలు అంటే కాలి వేళ్ళమీద నడవడం, చేతులు కొట్టుకోవడం వంటివి ఉన్నా మిగిలిన విషయాలు అంటే పిల్లలతో కలవడం, ఆడుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు హుషారుగా ఉండడం, కొత్తవారిని కూడా నవ్వుతూ పలకరించడం వంటి సాధారణ పిల్లల బిహేవియర్ చూసి మేము మళ్ళీ డాక్టర్ గారిదగ్గరకువెళ్లి ఇది ఆటిజం కాదేమో డాక్టర్ గారు, వినికిడి ఏమైనా ఇబ్బంది ఉన్నదేమో అని చెప్పడంతో అబ్బాయికి బేరా వినికిడి పరీక్ష చేపించాము, దానికి సంబంధించిన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేపించాము, 



థెరపీ సర్వీసులు :
ఆపరేషన్ తరువాత స్పీచ్ థెరపీ ఇప్పించాలన్నారు,  థెరపీ సెంటర్ చూస్తేనే బాబు ఏడిచేవాడు, ఎలాగోలా థెరపీ సెంటర్ కి తీసుకువెళితే అక్కడ వాళ్ళు బాబు కి ఏ థెరపీ ఇస్తున్నారో ఏమీ చెప్పేవారు కాదు, రూమ్ లోకి తీసుకెళ్లవరు, బాబు ఏడుపు తప్పించి ఆ రూంలో థెరపీ ఏమి జరుగుతుందో తెలిసేది కాదు, ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్ కనపడడం లేదండి అని చెప్పినప్పుడు టైం పడుతుందండి అనేవారు, ఎంత టైం అనేదీ తెలియదు, మేమేమి చెయ్యాలో తెలియదు, వాళ్ళ థెరపీ ఏమిటో తెలియదు, ఒక రకంగా చెప్పాలంటే తల్లిగా, కుటుంబంగా మేమేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వచ్చింది,

 



పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్:
మా అబ్బాయి లా కొన్ని వేలమంది ఉన్నారని, ఆటిజం తో ఇబ్బంది పడుతున్నవారు కొన్ని కోట్ల మంది ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మందికి పైగా న్యూరోలాజికల్, సైకలాజికల్ కండిషన్లతో బాధపడుతున్నవారు ఉన్నారని అర్థం అయ్యింది వీరందరికీ, బంగారం లాంటి వారి భవిష్యత్తు కోసం, వారి కుటుంబాలలో ఆనందపు వెలుగులు నింపడానికి మొదలుపెట్టినదే పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్. దాదాపు మూడేళ్ళ రీసెర్చ్ తరువాత మొదటి సెంటర్ ను సుచిత్ర, బోయినపల్లి, హైదరాబాద్ లో రెండేళ్ల క్రితం మొదలు పెట్టడం జరిగింది, ఈ రోజు దాదాపు 14 సెంటర్లు హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాల్లో వేలమంది పిల్లలకు థెరపీ సర్వీసెస్ అందజేస్తున్నాయి।


ప్రతి పిల్లాడు, పాప ప్రత్యేకం, వారి థెరపీ సర్వీస్ కూడా వారికోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిఉండాలి, అందుకే దాదాపు 140 మందికి పైగా సర్టిఫైడ్, క్వాలిఫైడ్, ఎక్సపీరియెన్స్డ్, నిష్ణాతులైన థెరపిస్టులను పెర్మనెంట్, ఫుల్ టైం ఎంప్లాయిస్ గా తీసుకున్నాం, పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ లో వారానికి ఐదు రోజులు థెరపీ, ప్రతిరోజు 40 నిముషాలు పిల్లాడికి ప్రత్యేకంగా కేటాయించబడిన థెరపిస్ట్ థెరపీ సర్వీస్ అందిస్తారు, ఆ థెరపీ మొత్తాన్నీ రిసెప్షన్ ఏరియాలో ఉన్న తల్లిదండ్రులు లైవ్ లో స్పష్టంగా చూడవచ్చు, థెరపీ తరువాత 5 నిముషముల పాటు థెరపిస్ట్ తో మాట్లాడవచ్చు.   

మీరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫారం సహాయంతో ఈరోజు థెరపీ ఫీడ్ బ్యాక్ ఆ రోజే పేరెంట్స్ కు తెలియచేయబడుతుంది, మరుసటి రోజు థెరపీ కి అటెండ్ అయ్యేంత వరకూ ఇంటి వద్ద ఏమి చెయ్యాలో కూడా చెప్పబడుతుంది.

 

దేశ - విదేశాల్లో : 
ఇప్పటి వరకూ దాదాపు లక్షా పదిహేను వేలకు పైగా థెరపీ సర్వీసులను కండక్ట్ చెయ్యడం జరిగింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుప్రజలే కాకుండా, తమిళనాడు, బెంగుళూరు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ మొదలగు రాష్ట్రాలనుండి, అమెరికా, యూకే, లండన్, కువైట్, ఖతార్ వంటి దేశ, విదేశీయులు కూడా పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ యొక్క 98 % పైగా ఇంప్రూవ్మెంట్, 99 % పైగా కస్టమర్ సంతృప్తి ఉన్న సర్వీసెస్ వలన లాభం పొందారు.

 

సేవ ఫౌండేషన్: 
మా సంపాదన లో 33 % సమాజహితానికి ఇచ్చే కోటి గ్రూప్ లోని హెల్త్ టెక్ డివిజన్ అయిన భారత్ హెల్త్ కేర్ ప్రై లిమిటెడ్ సంస్థ యొక్క స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ యూనిట్ గా  వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి, నెలవారీ వేతనం 25 వేలకంటే తక్కువ ఉన్నవారికి నెలవారీ థెరపీ ఫీజు 15 వేల రూపాయల్లో సేవ ఫౌండేషన్ వారి సహాయం ఇవ్వబడుతుంది

 

ఫ్రాంచైజ్ అవకాశాలు :
80 కోట్ల మందికి పైగా నాణ్యమైన న్యూరోలాజికల్, సైకలాజికల్ కండిషన్ థెరపీ, కౌన్సిలింగ్ సర్వీసులు అవసరమీరోజు, ఈ అవసరాన్ని తీరుస్తూ ఆటిజం కండిషన్ ఉన్న పిల్లల తల్లిదండ్రులకు నలుగురికీ మంచి చేస్తూ వారు మంచిగా ఉండేవిధంగా, వారి ఆటిజం కండీషన్ తో ఉన్న పిల్లలకు జీవిత ఉపాధి కల్పించడానికి రూపొందిచినదే ఈ  పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ఫ్రాంచైజ్ అవకాశం..!















మరింత సమాచారం తెలుసుకోండి: