అన్యోన్య దాంపత్యం తొలి పంటగా ఓ చిన్నారి అడుగుపెడితే ఆ ఇల్లు ఎంత సందడిగా ఉంటుంది. తొలి సంతానం కోసం యువ దంపతుల ఎదురుచూపులు ఎంత తీయగా ఉంటాయి. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ.. తనలోనుంచి ఊపిరిపోసుకున్న మరో ప్రాణం అంటే.. ఆ జంటకు ఆరో ప్రాణమేగా.. కోటిరెడ్డి, శ్రీజారెడ్డి.. ఈ జంట కూడా తాము అమ్మానాన్న కాబోతున్నామని తెలిసి అంతే ఆనందపడ్డారు. 


తొలి సంతానం అబ్బాయి.. ముద్దులొలికే రూపం.. ముద్దుమాటలు.. ఇక ఇల్లంతా అల్లరే..అయితే ఓ ఏడాదిన్నర తర్వాత సంహిత్ లో ఆటిజం సంబంధించిన లక్షణాలు కనిపించాయి. అంటే కాలి వేళ్ళమీద నడవడం, చేతులు కొట్టుకోవడం వంటివి గుర్తించారు. వైద్యుల వద్దకు తీసుకెళ్తే ఆటిజం అని డయాగ్నోసిస్  చేసి చెప్పారు. సంహిత్ కు ఆటిజం లక్షణాలు కొన్ని ఉన్నా..  మిగిలిన విషయాలు అంటే పిల్లలతో కలవడం, ఆడుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు హుషారుగా ఉండడం, కొత్తవారిని కూడా నవ్వుతూ పలకరించడం వంటి సాధారణ పిల్లల బిహేవియర్ ఉండేది.

 

అది చూసి కోటి, శ్రీజ దంపతులు మళ్ళీ డాక్టర్ గారిదగ్గరకు వెళ్లి ఇది ఆటిజం కాదేమో డాక్టర్ గారు, వినికిడి ఏమైనా ఇబ్బంది ఉన్నదేమో అని చెప్పారు. వినికిడి పరీక్ష చేయించారు. దానికి సంబంధించిన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేపించారు. ఆపరేషన్ తరువాత స్పీచ్ థెరపీ ఇప్పించాలన్నారు,  థెరపీ సెంటర్ చూస్తేనే బాబు ఏడిచేవాడు, ఎలాగోలా థెరపీ సెంటర్ కి తీసుకువెళితే అక్కడ వాళ్ళు బాబు కి ఏ థెరపీ ఇస్తున్నారో ఏమీ చెప్పేవారు కాదు, రూమ్ లోకి తీసుకెళ్లవరు, బాబు ఏడుపు తప్పించి ఆ రూంలో థెరపీ ఏమి జరుగుతుందో తెలిసేది కాదు, ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్ కనపడడం లేదండి అని చెప్పినప్పుడు టైం పడుతుందండి అనేవారు, ఎంత టైం అనేదీ తెలియదు, ఏంచెయ్యాలో తెలియదు. 

 

తమ అబ్బాయి లా కొన్ని వేలమంది ఉన్నారని, ఆటిజం తో ఇబ్బంది పడుతున్నవారు కొన్ని కోట్ల మంది ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మందికి పైగా న్యూరోలాజికల్, సైకలాజికల్ కండిషన్లతో బాధపడుతున్నవారు ఉన్నారని కోటి, శ్రీజ దంపతులకు అర్థం అయ్యింది. బంగారం లాంటి వారి భవిష్యత్తు కోసం, వారి కుటుంబాలలో ఆనందపు వెలుగులు నింపడానికి మొదలుపెట్టినదే పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్।


సంహిత్ కు చికిత్స కోసం వెళ్లినప్పుు.. ఒక్కో చికిత్స కోసం ఒక్కో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌ ఒక చోట. ఫిజియో థెరపీ మరొక చోట. స్పీచ్‌ థెరపీ ఇంకో దగ్గర ఇలా చికిత్స కోసం రోజుకు నాలుగైదు చోట్లకు తిరగాల్సి వచ్చేది. ఇలా తమ కుమారుడి కోసం కోటి దంపతులు పరిశోధనే చేశారు. 

 

అప్పడు కానీ వారికి అర్థం కాలేదు.. ఆటిజం సమస్య చిన్నారులను ఎంతగా కుంగతీస్తుందో.. దీనికి ఇండియాలో సరైన చికిత్స సదుపాయాలు లేక చిన్నారులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో..! అప్పుడే వారిలో ఊపిరిపోసుకుంది పినాకిల్ బ్లూమ్స్ ఆలోచన. ఆటిజం చిన్నారులకు అవసరమైన సేవలన్నింటినీ ఒకే వేదిక ద్వారా అందించేందుకు నడుంబిగించారు. 

 

ఆటిజం సమస్యపై పరిశోధన కోసమే రూ. 4కోట్లు ఖర్చు చేశారు. మూడేండ్ల పరిశోధన తర్వాత ‘పినాకిల్‌ బ్లూమ్స్‌' పేరుతో బోయినపల్లి సమీపంలోని సుచిత్రలో మొదటి కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ పినాకిల్ బ్లూమ్స్  జంటనగరాల్లో  మొత్తం 14 కేంద్రాల్లో సేవలందిస్తోంది. ఇక్కడే కోటి, శ్రీజ దంపతుల ప్రత్యేకత చెప్పుకోవాలి. ఆటిజం వంటి లక్షణాలు కలిగిన చిన్నారి పుడితే.. వేరే ఎవరైనా అయితే కుంగిపోతారు. ఎంత ఖర్చయినా పరవాలేదని చికిత్స చేయించి..అక్కడితో ఆగిపోతారు. 

 

కానీ కోటి, శ్రీజగార్లు.. ఈ సమస్యను ఎదుర్కొన్న తీరు అసామాన్యం. తమ బిడ్డకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదన్న తపనతో వారు సాగించిన పరిశోధన ఏకంగా పినాకిల్ బ్లూమ్స్ వంటి  సంస్థకు ఊపిరిపోసింది. వేలాది మంది చిన్నారులు, వారి తల్లిదండ్రుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఈ సేవలను ధనంతో వెలకట్టలేం. కోటి, శ్రీజ దంపతులు కొడుకు కోసం కష్టపడితే.. "కోటి" చిరునవ్వులు విరిశాయి. పసివాళ్లకు వరమయ్యాయి.









మరింత సమాచారం తెలుసుకోండి: