మేము గెలుస్తాం... మేమే గెలుస్తాం. మేము గెలిచి తీరతాం. అరవింద్ కేజ్రివాల్ పని అయిపోయింది. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎంత మాత్రం లేదు. ఉండదు ఉండబోదు. దేశాన్ని పాలించేది మేమే దేశ రాజధానిని పాలించేది మేమే అన్న బిజెపి నేతలకు సింపుల్ గా చీపురుతో సమాధానం చెప్పారు అరవింద్ కేజ్రివాల్. అంత వరకు బాగానే ఉంది గాని ఆయన చేస్తున్న రాజకీయం ఇప్పుడు బిజెపిని చికాకు పెడుతుంది. అంటే ఆయన ప్రత్యక్షంగా చేయడం లేదు గాని పరోక్షంగా చేయడానికి సిద్దమయ్యారు. ప్రశాంత్ కిషోర్ ద్వారా ఇప్పుడు ఒక వ్యూహం సిద్దం చేసారు. 

 

అదే బీహార్ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని... బీహార్ ఎన్నికలు నెలల వ్యవధిలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే మాత్రం బిజెపికి చుక్కలు కనపడట౦ ఖాయం. ఇప్పుడు దీనికి బ్రేక్ వెయ్యాలి అనేది కేజ్రివాల్ యోచన. అయిదేళ్ళు గా కేజ్రివాల్ ని ప్రశాంతంగా నిద్రపోనీయలేదు బిజెపి. ఎదోకరకంగా ఆయన మీద పెత్తనం చెయ్యాలనే చూసారు బిజెపి నేతలు. ప్రధానంగా మోడిషా. ఇప్పుడు వాళ్ళను కంట్రోల్ చేయడానికి ఆయన బీహార్ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఇందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్, కేజ్రివాల్ ముందు ఒక ఐడియా పెట్టారు. అది ఏంటీ అంటే, ఆర్జెడితో పొత్తు పెట్టుకుందాం, కాంగ్రెస్ ను బయట ఉంచుదాం. అప్పుడు దళిత వర్గాల ఓట్లు మనకే పడతాయి. కాంగ్రెస్ అగ్ర కులాలు ఉన్న చోట విజయం సాధిస్తుంది. ఎన్నికలు అయిన తర్వాత స్పష్టమైన మెజారిటి రాకపోతే అప్పుడు కాంగ్రెస్ తో కలిసి ముందుకి వెళ్ళవచ్చు. ఇక తటస్థులు, మెజారిటి విద్యావంతులు ఆప్ పక్షాన నిలబడే అవకాశం ఉంది. దీనితో బిజెపికి చుక్కలు కనపడటం ఖాయం అనేది ప్రశాంత్ వ్యూహం. దీనికి కేజ్రివాల్ కూడా ఓకే చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: