భారత ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అమెరికాతో సంబంధాలను ఏర్పరచు ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించడం...  పలుమార్లు జరిగాయి. ఇకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇప్పటివరకు భారత్లో పర్యటించలేదు.   ఇక తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్నారు అంటే... ఏర్పాట్లు కూడా భారీగానే వుండాలి. కాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం భారీగానే జరుగుతున్నట్లు సమాచారం. 

 


 అయితే డోనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాట్ల కోసం భారీగానే ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో పర్యటించనున్నారు. కేవలం మూడు గంటలు మాత్రమే డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్లో పర్యటిస్తారు. కాగా  ట్రంపు మూడు గంటల పర్యటన కోసం మోదీ ఏకంగా అహ్మదాబాద్లో 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. మూడు గంటల పర్యటన కోసం వంద కోట్ల అంటూ  ఈ ఖర్చు  తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈ వందకోట్ల లో 14 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని మిగతాదంతా గుజరాత్ ప్రభుత్వమే భరిస్తున్నట్లు తెలుస్తుంది.  

 

 ముఖ్యంగా ఇందులో భద్రతకు గాను 12 కోట్లు కేటాయించారుట... దాదాపు లక్ష మంది అతిథుల కోసం పది కోట్లు,  రోడ్ల మధ్యలో ఈత జాతి చెట్ల కోసం ఏకంగా ఆరు కోట్లు... ట్రంపు రోడ్ షో కి 10 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.ఇక ట్రంపు 3 గంటల పర్యటన కోసం... ఇంత భారీ మొత్తంలో మోదీ సర్కార్ ఖర్చు చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది.మోదీ తనకి తాను గొప్ప లీడర్ అని నిరూపించుకునేందుకు... మోదీ సర్కార్ మరి ఇంత ఖర్చు చేయాలా అనే విమర్శలు కూడా వస్తూన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ట్రంపు పర్యటన ఆసక్తిని సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: