ఆయ‌న పేద‌ల మ‌నిషి! మ‌ట్టి వాస‌న‌లు తెలిసిన స‌గ‌టు యువ‌కుడు. కానీ, నేడు ప్ర‌పంచం ఎదుర్కొంటు న్న అనేక‌స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించాల‌నే త‌ప‌న‌తో త‌న‌దైన శైలితో ముందుకు సాగుతున్న టెక్ దిగ్గ‌జం. ఆయ‌నే స‌రిప‌ల్లి కోటిరెడ్డి. ``చాలా చేయాల‌నుకున్నానండీ.. ప‌రిస్థితులే స‌హ‌క‌రించ‌లేదు. అందు కే ఇలా ఉండిపోయాను!``-అని చెప్పుకొని జీవితంలో రాజీప‌డిపోయే వంద‌ల వేల‌మంది యువ‌త ఆలోచ న‌ల‌కు బిన్నంగా త‌న‌కు అన‌నుకూలంగా ఉన్న ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగిన యువ కెర‌టం.

Kotii Group of ventures vision

కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోని మారుమూల గ్రామ‌మైన జ‌గ‌న్నాథ‌పురంలోని ఓ దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి రైతు కుటుంబంలో పుట్టిన కోటిరెడ్డి నేడు ప్ర‌పంచం గ‌ర్వించేస్థాయికి ఎదిగారు. జీవితంలో ఎద‌గాల‌ని అంద‌రికీ ఉంటుంది. కానీ, ఏదారిలో వెళ్లాల‌నేదే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇక్క‌డే యువ‌త ప్ర‌స్థానం ఆగిపోతుంది. దారి క‌నిపించే స‌రికే ఏళ్లు గ‌డిచిపోయి.. జీవితంతో రాజీప‌డిపో యిన వ్య‌క్తులు మ‌న‌కు అనేక మంది క‌నిపిస్తారు.



కానీ, కోటిరెడ్డి అలాకాదు.. త‌న‌కు ఎదురైన అనేస‌మ‌స్య ల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని వాటి నుంచి త‌న జీవ‌న మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగారు. పండ‌క్కి బ‌ట్ట‌లు కొనుగోలు చేసుకునేందుకు త‌ల్లి ఇచ్చిన వెయ్యి రూపాయ‌లను పెట్టుబ‌డిగా పెట్టుకుని పీజీడీసీఏ నేర్చుకున్నారు. అనంత‌రం.. ప్ర‌పంచంలోనే దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగ స‌ముపార్జ‌న ఆయ‌న జీవితాన్ని మేలిమ‌లుపు తిప్పింది. త‌న ఉద్యోగ ప్ర‌యాణంలో అమెరికాలో సాధించిన ఉపాధితో ఆయ‌న సంతృప్తి చెంద‌లేదు. ఈ దేశానికి, ఈ జ‌న్మ‌భూమికి ఏదైనా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

Kotii Group of ventures vision

ఈ క్ర‌మంలోనే సొంత‌గా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారం భించారు. 2014లో ఆయ‌న ఆలోచ‌న‌ల‌ను సాక్షాత్క‌రింప చేసుకున్నారు. కోటి గ్రూప్ ఆఫ్ వెంచ‌ర్స్‌ను ప్రారంభించారు. అనేక ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్రాణం పోశారు. ముఖ్యంగా వ్య‌క్తిగ‌త ఆరోగ్యానికి పెద్ద‌పీట వేశారు. ప్ర‌స్తుతం స‌మాజం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న అధ్య‌యనం చేస్తున్నారు. ప్ర‌భుత్వాల‌కు సాఫ్ట్ వేర్ నైపుణ్య సేవ‌లు అందిస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌పంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు త‌న సాంకేతిక‌త‌తో చెక్ పెట్టే ప్ర‌య‌త్నాల్లో స‌క్సెస్ అవుతున్నారు. ఇది ఆయ‌న జీవితాశ‌యంలో మేలి మ‌లుపు దిశ‌గా న‌డిపిస్తోంది. ప్ర‌పంచానికే దారి చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: