ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే అబ్బాయిలు భరిస్తారా...? అమ్మాయిని బ్రతిమిలాడుకోవడమో లేక హలో సృజనా తిన్నావారా అంటూ బూతుల పురాణం మొదలుపెట్టడం చేస్తూ ఉంటారు. అదే అమ్మాయిలు అయితే ఎం చేస్తారు చెప్పండి...? బేబీ ప్లీజ్ మాట్లాడూ, పెళ్లి చేసుకో అదీ ఇదీ అంటూ బ్రతిమిలాడుతూ ఉంటారు. ఇక వినకపోతే ఏదొకటి చేసుకుంటా అని బెదిరించడమే గాని అబ్బాయిల మాదిరి దాడులు చేయడం అలాంటివి చేయలేరు కదా...? చేస్తే ఏమవుతుంది చెప్పండి...? కుటుంబం పరువు పోతుంది. కొంత మంది అమ్మాయిలు అయితే ప్రాణం తీసుకుంటారు కూడా. 

 

పాపం తాజాగా ఒక అమ్మాయి ప్రేమించిన వాడిని ఏమీ చేయలేక అతని ఇంటి ముందు ధర్నా చేసింది. ప్రేమించాను అన్నాడు, పెళ్లి చేసుకుందాం అన్నాడు. నమ్మి ముందుకి వెళ్ళింది. చివరికి నో అన్నాడు. కనీసం మనిషి కూడా కనపడలేదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగింది. తిరుపతిలోని కొర్లగుంట లో ఉన్న నవోదయ నగర్‌ లో ఈ ఘటన హల్చల్ చేసింది. తిరుపతి రూరల్‌ అవిలాలకు చెందిన ఒక్క అమ్మాయి తాను చదివే కాలేజీ లో కొర్లగుంటకు చెందిన చంద్రమౌళి అనే యువకుడు కొంత కాలం క్రితం పరిచయం అయ్యాడు. 

 

ఆ మాట ఈ మాట పెరిగి, ఒకరిని ఒకరు ఇష్ట పడే వరకు వెళ్ళారు. చిగురించిన స్నేహం కాయ కాచి ప్రేమ అయింది. ఇది ఆ నోట ఈ నోట పడి చివరకు ఒకరి ఇంట్లో తెలిసింది. అమ్మాయి, అబ్బాయి కలిసి ఉన్నప్పుడు అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా చూసారు. దీనితో ఒకరిని ఒకరు ఇష్టపడటంతో వేరు చేయడం ఇష్టం లేక అబ్బాయి తల్లి తండ్రుల వద్దకు వెళ్లి పెళ్లి చెయ్యాలని కోరారు. కాని అతని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీనితో బాధిత అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడి పెళ్ళికి ఒప్పుకున్నారు కూడా. కాని అబ్బాయిని బెంగళూరు పంపించారు. ఎవరికి తెలియకుండా అతను వెళ్ళిపోవడంతో అమ్మాయి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: