ఐటి దాడుల పంచనామా రిపోర్ట్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందన. వైసిపి నేతలపై, సాక్షి మీడియాపై మండిపడ్డ  యనమల. టిడిపిపై చేసిన దుష్ప్రచారానికి లీగల్ గా చర్యలు తీసుకుంటాం. వైసిపి నేతలపై, సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తాం. ప్రెస్ కౌన్సిల్ కు, ఎడిటర్స్ గిల్ట్ కు ఫిర్యాదులు చేస్తామన్నారు. వైసిపి నేతలను, సాక్షి మీడియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆదివారం యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.  పిఎస్ పై దాడుల్లో రూ 2వేల కోట్లని వైసిపి నేతలు దుష్ప్రచారం చేశారు. 5రోజుల ఐటి దాడులని సొంత మీడియాలో బూతద్దంలో చూపారు.

 

రూ 2లక్షల నగదుకు, రూ 2వేల కోట్లని ప్రచారం చేస్తారా అని నిలదీశారు. 26  డొల్ల కంపెనీలని పిఎస్ పై దుష్ప్రచారం చేస్తారా అని ప్రశ్నించారు. వైసిపి అబద్దాలకు పరాకాష్ట ఐటి దాడులపై దుష్ప్రచారం చేసారని ఎదురు దాడి చేశారు. పంచనామా రిపోర్ట్ పై వైసిపి నేతలు ఇప్పుడేం జవాబిస్తారని అడిగారు. పంచనామా కాగితాలు చూశాకైనా వైసిపి బుద్ది తెచ్చుకోవాలి. తప్పుడు ప్రచారం చేసినందుకు టిడిపికి క్షమాపణ చెప్పాలి. మాజీ సిఎం చంద్రబాబుకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఎవరైతే దుష్ప్రచారం చేశారో వాళ్లందరిపై చర్యలు చేపట్టాలి.

 

అసత్యాలు ప్రచారం చేసిన వైసిపి నేతలపై చర్యలు తీసుకోవాలి. దుష్ప్రచారం చేసిన వారిపై క్రిమినల్, లీగల్  చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలన్నవాళ్లు ఇప్పుడేం జవాబిస్తారు అని ప్రశ్నించారు. అరెస్ట్ చేయాలన్న నోళ్లు ఇప్పుడెందుకు మూతబడ్డాయని ఎద్దేవా చేశారు. రోజుకు 20మంది చొప్పున లేచిన నోళ్లు ఇప్పుడెందుకు మూతబడ్డాయన్నారు. ఐటి దాడులపై వైసిపి నేతల విమర్శలన్నీ అబద్దాలే..సాక్షి మీడియా దుష్ప్రచారం అంతా అబద్దమే..అబద్దాలతో వైసిపి నేతలు అధికారంలోకి వచ్చారు. అబద్దాలతో వ్యాపారాలు చేశారు.

 

అబద్దాల రాజకీయాలు చేస్తున్నారు. వైసిపి నేతల బతుకే అబద్దంగా మారింది. అబద్దాల కాంగ్రెస్ గా వైసిపి పేరు మార్చుకోవడం బెటర్. వైసిపి మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అబద్దాలే. సన్నబియ్యంపై అబద్దాలు, 45ఏళ్లకే పించన్లపై అబద్దాలు, రాజధాని అమరావతిపై అబద్దాలు, దర్యాప్తు సంస్థలకు(సిబిఐ,ఈడికి) చెప్పేవన్నీ అబద్దాలు, కోర్టులకు చెప్పేవన్నీ అబద్దాలే. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులపై అబద్దాలే. పిపిఏల రద్దుపై చెప్పిందంతా అబద్దమే.. వీళ్ల అబద్దాలకు రాష్ట్రాన్ని బలిచేస్తున్నారు. భావితరాల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: