టెక్ దిగ్గ‌జం కోటిరెడ్డి స‌రిప‌ల్లి స్థాపించిన కోటిరెడ్డి ఫౌండేష‌న్ ద్వారా అనేక స్టార్ట‌ప్ సంస్థ‌ల‌కు నేడు దిశ చూపించే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సాంకేతిక యుగం ప‌రుగులు పెడుతున్న క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రికీ కంప్యూట‌ర్‌తోను, స్మార్ట్ ఫోన్ల‌తోనూ అవ‌స‌రం పెరిగిపోయింది. దీంతో సాంకేతిక అంశాల‌పై మ‌రింత అవ‌గాహన చాలా కీల‌కం. ఈ క్ర‌మంలోనే కోటిరెడ్డి స‌రిప‌ల్లి ఫౌండేష‌న్ ద్వారా అనేక నూత‌న అంశాల‌ను నేటి త‌రానికి ప‌రిచ‌యం చేస్తున్నారు. అనేక ఆవిష్క‌ర‌ణ‌లు చేస్తూనే భ‌విష్య‌త్తుకు అవ‌స‌ర‌మైన అనేక అంశాల‌పై ముందుగానే ప్ర‌యోగాలు చేసి ప్రపంచానికి ప‌రిచ‌యం చేస్తున్నారు.

Kotii Group of ventures


అదేస‌మ‌యంలో కొత్త‌గా ఎంట‌ర్ ప్రెన్యూర్స్‌గా ఎదిగే వారికి కూడా కోటిరెడ్డి ఫౌండేష‌న్ అనేక సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తోంది. కొత్తగా స్థాపించే సంస్థ‌కు లాభాలు, న‌ష్టాలు.. వినియోగ‌దారుల‌ను ఆకర్షించ‌డం వారికి అవ‌స‌రమైన సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డం వంటి అంశాల‌పైనా ఈ సంస్థ దృష్టి పెడుతోంది. ప్ర‌ముఖ మీడియాలో వారం వారం క‌థ‌నాల రూపంలో అందించే ఈ సూచ‌న‌లు, స‌ల‌హాల‌కు ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న సాంకేతిక మార్పులు కూడా కోటిరెడ్డి ద్వారా ఈ ప్రపంచానికి ముందుగానే ప‌రిచ‌య‌మ‌వుతున్నాయి.

Image result for kotii group of ventures

దీంతో కొత్త‌గా టెకీలుగా మారే సంస్థ‌ల‌కు కోటిరెడ్డి సూచ‌న‌లు, స‌ల‌హాలు ఎంతో ఉప‌యుక్తంగా ఉన్నాయ‌నడంలో సందేహం లేదు. ఒక్క సూచ‌న‌లు స‌ల‌హాల‌కే ప‌రిమితం కాకుండా స్టార్ట‌ప్ సంస్థ‌ల‌కు మాన‌సికంగా కూడా కౌన్సెలింగ్ ఇవ్వ‌డంలోనూ, వారిని ఆర్థికంగా పుంజుకునేలా చేయ‌డంలోను కోటిరెడ్డిఅనేక విధాల ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తున్నారు. సాధార‌ణంగా ఒక‌చోట ప‌నిచేయ‌డం.. నెల‌నెలా జీతం తీసుకోవ‌డం.. ఇది ఒక విధానం.. కానీ, స్టార్ట‌ప్‌గా మారి తానే కంపెనీని పెట్టిన‌ప్పుడు మొత్తంగా త‌న‌దే బాధ్య‌త‌. ఇదే విష‌యాన్ని స్టార్ట‌ప్‌ల‌కు వివ‌రించ‌డంలోను, వారిలో మ‌రింత ఉత్తేజాన్ని రేకెత్తించ‌డంలోను కోటిరెడ్డి త‌న ఫౌండేష‌న్ ద్వారా ఎంతో మందికి మార్గ‌ద‌ర్శిగా నిలిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: