రెండుసార్లు ఢిల్లీలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా హ్యాపీగా ఉన్నాడట. ఎందుకంటే అనుకున్నదానికన్నా తన పర్యటన చాలా విజయవంతమైనందన్న కారణంతో జగన్ ఫుల్లుగా హ్యాపీగా ఫీలవుతున్నాడని సమాచారం. ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అయ్యారు. దాదాపు నాలుగు నెలలుగా జగన్ కు మోడి అపాయిట్మెంటే ఇవ్వలేదు. అలాంటాది  ఢిల్లీ ఎన్నికల తగిలిన ఎదురుదెబ్బతో మోడి భూమి మీదకు దిగివచ్చారు.

 

అందుకనే ఫలితాలు వచ్చిన రోజే అత్యవసరంగా జగన్ కు కబురు చేసి మరుసటి రోజే పిలిపించుకున్నారు. దాదాపు గంటన్నరపాటు మాట్లాడుకున్నారు. సరే ఈ భేటిలో వ్యక్తిగత అవసరాలతో పాటు రాష్ట్రావసరాలు, రాజకీయావసరాలు కూడా ఉంటుందని అందరికీ తెలిసిందే.  అదే సమయంలో కొన్ని అంశాలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా మాట్లాడమని సూచించారు.

 

మోడితో భేటి ముగిసిన రెండో రోజు జగన్ మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అమిత్ తో సుమారు 40 నిముషాలు భేటి అయ్యారు. గడచిన మూడు నెలల్లో  మూడుసార్లు అమిత్ అపాయిట్మెంట్ ఇచ్చినా జగన్ ను కలవటానికి మాత్రం ఇష్టపడలేదు. మోడి ఆదేశాలతోనే అమిత్ కూడా జగన్ తో భేటి అయ్యారన్నది బహిరంగ రహస్యమే. అంటే ఇద్దరికీ జగన్ తో ఎంత అవసరం ఉంటే అంతంత సేపు భేటి అవుతారు ?

 

శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, ప్రత్యేకహోదా, కర్నూలులో హై కోర్టు ఏర్పాటుకు క్లియరన్స్ లాంటి అనేక అంశాలు కీలకమైనవి. ఇందులో మూడు రాజధానుల ఏర్పాటు, కర్నూలులో హై కోర్టు, శాసనమండలి రద్దుకు మోడి, అమిత్ ఇద్దరూ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అదే విషయాన్ని జగన్ ఎంపిలతో స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.  కేంద్రంలోని పెద్దలు హామీ ఇచ్చిన ప్రకారమైతే మార్చి 15వ తేదీలోగా మండలి రద్దు అయిపోతుందని చెప్పాడట. అలాగే హై కోర్టు కర్నూలులో ఏర్పాటుకు సుప్రింకోర్టు కొలీజియంతో మాట్లాడుతామని కూడా హమీ లభించిందని జగన్ ఫుల్లు హ్యాపీగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: