గడచిన పదిరోజులుగా చంద్రబాబునాయుడు అడ్రస్ లేడు. అడ్రస్ లేడంటే మీడియాతో మాట్లాడి ఇప్పటికి పది రోజులైంది. మామూలుగా అన్నం తినటం, గాలి పీల్చటం మానేస్తాడేమో కానీ మీడియాతో మాట్లాడకుండా మాత్రం చంద్రబాబు ఒక్కరోజు కూడా ఉండలేదన్న విషయం అందరికీ తెలుసు. మరి అలాంటి చంద్రబాబు మీడియాకే కాదు చాలామంది పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేరంటే వినటానికే ఆశ్చర్యంగా ఉంది.  ఐటి దాడుల తర్వాత ఐటి శాఖ అధికారికంగా రిలీజ్ చేసి ప్రెస్ నోట్ చంద్రబాబును వణికించేస్తోంది.

 

ఐటి శాఖ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ దెబ్బకు చంద్రబాబు, చినబాబు తో పాటు చాలామంది సీనియర్లు మీడియా ముందుకు రావాలంటేనే వణికిపోతున్నారు. మీడియాతో మాట్లాడుతున్న యనమల రామకృష్ణుడు, పంచుమర్తి అనురాధ లాంటి వాళ్ళు కూడా ప్రెస్ నోట్ జారీ చేసిన ఐటి శాఖను కాకుండా వైసిపి నేతలను టార్గెట్ గా  ఎదురుదాడి చేసి వెళ్ళిపోతున్నారు.

 

దాదాపు 10 ఏళ్ళు చంద్రబాబు దగ్గర పిఏగా తర్వాత పిఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ పై ఐటి దాడులు జరిగితే ఆ దాడులతో చంద్రబాబుకు లేదా టిడిపికి ఏమీ సంబంధం లేదని అడ్డదిడ్డంగా మాట్లాడటమే టిడిపి అడ్డుగోలు వాదనకు అద్దం పడుతోంది. అదే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో బీరకాయ పీచు సంబంధం ఉన్న వాళ్ళ మీద దాడులు జరిగుంటేనా ?  ఈ పాటికి చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు వందల కొద్దీ ప్రెస్ మీట్లు పెట్టి నానా యాగీ చేసేసుండే వారనటంలో సందేహమే లేదు.

 

ప్రత్యర్ధులపై బురద చల్లటమంటే చంద్రబాబు, టిడిపి నేతలు, చంద్రబాబు మీడియాకు ఎక్కడలేని ఆనందం. అయినదానికి కానీదానికి జగన్ కు వ్యతిరేకంగా జాతీయ మీడియాను రంగంలోకి దింపే చంద్రబాబు ఇపుడు అదే జాతీయ మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు.  చంద్రబాబుతో మాట్లాడేందుకు  లైవ్ మింట్ మీడియా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదంటేనే ఎంతగా భయపడుతున్నది అర్ధమైపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: