ప్రస్తుతం చైనా దేశంలో కరోనా  వైరస్ మరణ మృదంగం మోగిస్తున్న విషయం తెలిసిందే . ప్రపంచ దేశాలను  భయపెడుతున్న ఈ ప్రాణాంతకమైన వైరస్... చైనా దేశంలో అయితే మరింత గా విజృంబిస్తోంది. ఇప్పటికే 1500 మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 65 వేల మందికి పైగా కరోనా  వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. అయితే కరోనా  వైరస్ను తగ్గించేందుకు చైనా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలించడం లేదు. దీంతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. కరోనా  వైరస్ నేపథ్యంలో అటు ప్రజలకు కూడా ఒకరినొకరు కలుసుకోవడానికి వీలు లేకపోవడంతో చైనా ప్రజల జీవితం మరింత దుర్భరంగా మారిపోయింది. 

 


 మరోవైపు  ప్రపంచ దేశాల శాస్త్రజ్ఞులు కూడా ఇది ప్రాణాంతకమైన వైరస్ కు విరుగుడు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ప్రస్తుతం చైనా దేశంలో ప్రాణత్యాగం తో పాటు ఆర్థిక నష్టం కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ చైనాలో కరోనా  విజృంభిస్తుండటంతో  వివిధ దేశాలకు చెందిన అన్ని సర్వీసులు పాక్షికంగా రద్దు చేసుకున్నాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. కరోనా  ఎఫెక్ట్ తో చైనా లోని ప్రజలందరూ అతలాకుతలమై పోతున్నారు.  ఇలాంటి సమయంలో ప్రియమైన వారిని కూడా దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ చైనాకు చెందిన 87 ఏళ్ల వ్యక్తి వైరస్ సోకిన తన భార్యను సపర్యలు చేస్తున్న  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 


 ప్రస్తుతం ఈ వీడియో అందరిని కంటతడి పెట్టిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే ఆ వృద్ధుడు కూడా కరోనా వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే చైనా దేశంలో కరోనా  వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్న వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న 87 ఏళ్ల వృద్ధుడు ఒక వార్డులో ఉన్న తన భార్య దగ్గరకు వెళ్లి తన చేతి  సెలైన్  పట్టుకొని మరో చేతితో ఆహారం నీళ్లు అందించాడు. అనంతరం ఆమె పక్కనే కూర్చుని కంటికి రెప్పలా చూసుకొన్నాడు. ఇదంతా వీడియో తీసిన పీపుల్స్ డైలీ చైనా అనే సంస్థ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. 87 ఏళ్ల వ్యక్తి తన భార్య దగ్గరకు వెళ్లి ఇంత  జాగ్రత్తగా చూసుకోవడం ఆనందాన్ని కలిగించిందని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. కరోనా లాంటి వైరస్ లు ఎన్ని వచ్చిన వీరి ప్రేమను విడుదలయ్య లేవు అంటూ అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. మీరు త్వరగా కోలుకోవాలని అకాంక్షిస్తున్నాము అంటూ   క్యాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: