ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిలో ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాలన్ని  అల్లకల్లోలం అవుతున్నవి విషయం తెలిసిందే. ఓవైపు అమరావతిలో రైతులు సీఎం  జగన్మోహన్ రెడ్డి రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని చేపడుతున్నారు. మరోవైపు విపక్ష పార్టీలు అన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. కాగా  ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో మూడు రాజధానుల  అంశమే హాట్ టాపిక్ గా మారింది. అయితే మూడు రాజధాని అంశం ప్రకటించి ఇప్పటికే 60 రోజుల పైగా అయినప్పటికీ రాజధాని అమరావతి రైతులు మాత్రం నిరసనలు ఆపడం లేదు. 

 

 మరోవైపు బిజెపి జనసేన టిడిపి పార్టీలు రైతులకు మద్దతుగా అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సర్కార్ మూడు రాజధానులు  సంబంధించిన పనులు కూడా  చకచకా జరుపుతున్నట్లు కూడా సమాచారం. ఇదిలా ఉంటే జగన్ మూడు రాష్ట్రాల ప్రకటన చేసినప్పటి నుంచి సిపిఐ  నారాయణ జగన్ సర్కార్ పై పలు మార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు సిపిఐ నేత నారాయణ. 

 

 మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడిన సిపిఐ నారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏపీలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి  సర్కార్ కు థాంక్స్ చెప్పాలి అంటూ సిపిఐ అగ్రనేత నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో 3 రాజధానుల ప్రకటనతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంతగానో జోరందుకున్నదని  ఆయన అన్నారు. ఏపీలో జగన్ చంద్రబాబు ఇద్దరు దొంగలే అంటూ విమర్శించారు సిపిఐ నేత నారాయణ. మరోవైపు బీజేపీ పై కూడా ఆయన విమర్శలు చేశారు. బిజెపి ని ప్రశ్నించే వారిని దేశ ద్రోహులుగా బిజెపి చిత్రీకరిస్తుంది అంటూ మండిపడ్డారు. మొన్న బీజేపీ ప్రవేశపెట్టిన కేంద్ర  బడ్జెట్ ఉగ్రవాద బడ్జెట్ అంటూ సిపిఐ నారాయణ అభివర్ణించారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారని... విపక్షాలపై దాడులు కూడా పెరిగాయి అంటూ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: