టీడీపీ  కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఎప్పుడు జగన్ సర్కార్ పై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయతలపెట్టిన మూడు రాజధానుల  నిర్ణయంపై ఇప్పటికే పలుమార్లు టీడీపీ  కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా మరోసారి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు  టిడిపి నేత దేవినేని ఉమ. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి దేవినేని ఉమ... మంత్రి బొత్స సత్యనారాయణ పై విమర్శలు గుప్పించారు. ఇక టీడీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా వదలకుండా తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. 

 

 విశాఖపట్నంలోని వెంకోజిపాలెం లో ఉన్న జ్ఞానానంద ఆశ్రమం పైన వైసిపి నేతల కన్ను పడిందని ఆరోపించిన దేవినేని ఉమా... మొత్తం ఆరున్నర  ఎకరాల భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆరోపించారు. దాదాపు 300 కోట్ల విలువైన ప్రాపర్టీ పై కన్ను వేసిన అధికార పార్టీ నేతలు... ఎప్పుడెప్పుడు ఆ భూమిని దక్కించుకుందామా అని  చూస్తున్నారు అంటూ ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. అక్కడ ఉన్న స్వామీజీని వెళ్లగొట్టి ఆశ్రమానికి గ్రామస్తులతో ఉన్న రోడ్డు గొడవను తమ స్వలాభం కోసం వాడుకునేందుకు అధికార పార్టీ నేతలు  ప్రయత్నాలు చేస్తున్నారంటూ దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. 

 


 అధికార పార్టీ నేతలు విశాఖలోని గయాలి  భూములను కూడా వదలడంలేదు అంటూ ఆరోపించారు టీడీపీ కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమ. యథేచ్ఛగా  కబ్జాలు చేసుకుంటూ పోతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. ఎ2 ముద్దాయి అయిన విజయ్ సాయి రెడ్డి... ఈ మధ్య ట్విట్లు  పెట్టడం చాలా తగ్గించారని ఎద్దేవా చేసిన దేవినేని ఉమా... ఓసారి ట్వీట్ చేయవయ్యా చూసి చాలా రోజులైంది అంటూ సెటైర్ వేశారు. 300 కోట్ల ఆశ్రమ ప్రాపర్టీని దోపిడీ చేయడానికి... ఇప్పటికే ఆశ్రమ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల నుంచి బెదిరింపులు వెళ్లాయి అంటూ దేవినేని ఉమా  ఆరోపించారు. పోలీసులతో ఆశ్రమ వర్గాలను పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీని కోసమేన  మీరు విశాఖ వెళ్తుంది అంటూ నిలదీశారు దేవినేని ఉమ.

మరింత సమాచారం తెలుసుకోండి: