జాతీయ పత్రికలు అలా రాస్తున్నాయి..ఇలా రాస్తున్నాయి.. అంటూ మీడియా సమావేశాలు పెట్టి వైసిపి ప్రభుత్వం ఊదరగొట్టే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఐటి దాడులపై జాతీయ మీడియాకు అందుబాటులో రావడం లేదట. దీనికి సంబందించి వచ్చిన కదనం ఆసక్తికరంగా ఉంది. ఐటీ దాడుల్లో గుర్తించిన అక్రమ లావాదేవీలపై శనివారం కథనం రాసిన లైవ్‌ మింట్‌ ఆంగ్ల పత్రిక చంద్రబాబును పలుమార్లు ఫోన్‌ చేసి సంప్రదించినా ఆయన స్పందించలేదట. ఇదే విషయాన్ని మింట్‌ తన వెబ్‌సైట్‌లో ఉన్న కథనంలో పేర్కొంది.

 

రెండు వేల కోట్లతో సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని అడిగేందుకు చంద్రబాబు కోసం ఫోన్లో ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపింది. అంతేకాక.. ఆయనకు ఈ–మెయిల్‌ పంపినా జవాబు రాలేదని ఆ కథనంలో పత్రిక తెలిపింది. ఐటి దాడులు - మీడియా వ్యవహారం కాదు- వీర్రాజుఆదాయపన్ను శాఖ దాడులకు సంబందించి టిడిపి చేస్తున్న వాదనను బిజెపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తోసిపుచ్చారు. ఇది మీడియాకు, పార్టీలకు సంబందించిన విషయం కాదని, వ్యవస్థలు వాటి పని అవి చేస్తాయని అన్నారు.

 

మీడియాలోనో, లేక మరెవరో చెప్పారు కనుక వాటి ప్రాదాన్యత తగ్గదని, తీగ లాగారని, డొంక కదులుతుందని ఆయన చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు నిరంతరం పనిచేయాలని, ఎపిలో జరిగిన వాటిని పట్టుకుని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. కేంద్ర సంస్థలు సమర్దంగా పని చేయకుండా ఉండే వాతావరణాన్ని గత ప్రభుత్వం చేసిందని, ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయిందని ఆయన అన్నారు. ఆడిటర్లు, ఆడ్వకేట్లు దీనిని పెద్ద అంశంగానే భావిస్తున్నారని వీర్రాజు అన్నారు.

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల్లో పట్టుబడిన సొమ్ము వివరాలు పేర్కొన్న పంచనామా నివేదిక. రూ.2. 63 లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్న ఐటీశాఖ. రూ. 2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేల్చిన ఐటీ పంచనామా నివేదిక. పంచనామా నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని రెండ్రోజుల నుంచి ఆరోపణలు.

మరింత సమాచారం తెలుసుకోండి: