కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా స్థాయిలో నిరసనలు వెల్లువెత్తిన  విషయం తెలిసిందే. అయితే పౌరసత్వ సవరణ చట్టం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఈ చట్టానికి  వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ఉద్రిక్త పరిస్థితులకు కూడా దారితీసాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలకాల వద్దా అనే దానిపై తీవ్రమైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టానికి తమ మద్దతు ఉండదు అంటూ తెలిపిన విషయం తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 

 

 కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పలువురు కీలక రాజకీయ నాయకులు కూడా పౌరసత్వ సవరణ చట్టం పై తాజాగా తమ స్వరం వినిపిస్తున్నారు. అయితే తాజాగా పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి టీడీపీ  కీలక నేత మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలని అందుకు టిడిపి కూడా మద్దతు ఇవ్వకపోతే టిడిపి పార్టీకి తాను రాజీనామా చేస్తానంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ... ఎన్ఆర్సి సిఏఏ ఎన్పిఆర్ బిల్లులతో  పేదలకు ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు. ఎలాంటి అవగాహన లేక ఇలాంటి బిల్లులకు మద్దతు తెలుపుతున్నారు అంటూ కేశినేని నాని అన్నారు. 

 

 ఇక నిన్న పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి  ఏపి డిప్యూటీ సీఎం అంజాద్ భాష సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టం పై  ప్రభుత్వం ముందుకు వెళితే తాను రాజీనామా చేస్తానని  ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా  సంచలన ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. నాకు పదవులు ముఖ్యం కాదని నియోజకవర్గ ప్రజలే ముఖ్యం అంటూ ఆయన వెల్లడించారు.పౌరసత్వ  సవరణ చట్టం పై కేంద్రం మొండిపట్టు తో ముందుకు వెళితే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపారు. సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సీఎం జగన్ ను  ఒప్పిస్తా అంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్డీయేలో  చేరే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: