జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఫుల్ టైమ్ రాజకీయాలు చేయటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల రాయలసీమ ప్రాంతం కర్నూలు లో పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. ఆ సందర్భంలో 2017 వ సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదోతరగతి అమ్మాయిని అత్యాచారం హత్య ఘటనపై కేసు విషయంలో బాబు మరియు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టడానికి నిరసన చేపట్టిన విషయం అందరికీ తెలిసినదే.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భవిష్యత్తు రాజకీయాలను దిశానిర్దేశం చేసేది జనసేన పార్టీయేనని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఉద్యమాలతో మిగిలిపోయే పార్టీ కాదని, ప్రజల మన్ననలతో అధికారం చేజిక్కించుకొనే పార్టీ అన్నారు. కుళ్లు, కుంతంత్రాలు, వెన్నుపోట్లు ఉంటాయని తెలిసే రాజకీయాల్లోకి వచ్చానని… ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

 

ఇదే తరుణంలో జనసేన కార్యకర్తలు రేపల్లె నియోజకవర్గం లో ఉన్న సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..“సినిమాల్లో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. అవినీతి, ఆడపిల్లలపై జరిగినఅఘాయిత్యాలు చూసి ఆవేదనతో రాజకీయాల్లోకి వచ్చాను. కులం, జాతి చూసి ఓటేస్తే ఏ రాజకీయ పార్టీ గెలవదు అని అన్నారు. ఈ సందర్భంగా టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.

 

ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితులు వేరు ప్రజెంట్ పరిస్థితులు వేరు అని అన్నారు. ఓటుకు 2000 బైకులు ఇవ్వడం అప్పుడు లేవు. ఆ సమయంలో రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తాం అని ఎన్టీఆర్ ఇచ్చిన హామీకి భారీ మెజార్టీతో ఆయన్ని జనాలు గెలిపించారని తెలిపారు. అటువంటి జనం మరియు సమాజం ప్రస్తుతం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు అమ్ముకునే కొనుక్కునే రాజకీయ వ్యవస్థ మారితే గాని భవిష్యత్తు మారదని పవన్ తెలిపారు.  

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: