సొంతంగా పార్టీ పెట్టినా.. తొమ్మిది ఏళ్లపాటు అధికారానికి దూరమైనా... కేసులు పెట్టించినా.. జైలుకు పంపించినా.. ఎక్కడా జగన్ అధైర్యపడలేదు. వెనక్కి తగ్గలేదు. ఏపీలో అధికారం చేజిక్కించుకునే వరకు జగన్ చాలా మొండి గాని ముందుకు నడిచారు. ఈ క్రమంలో ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కానీ అప్పట్లోనూ.. ఇప్పట్లోనూ జగన్ ను తక్కువ అంచనా వేసిన వారంతా ఇప్పుడు షాక్ తింటున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇష్టం వచ్చినట్లుగా జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన వారంతా ఇప్పుడు ఆందోళన చెందడమే కాకుండా రాజకీయాల్లో ఉనికి కోల్పోయే పరిస్థితికి  వచ్చేశారు. ఎవర్ని ఎక్కడ ఎలా దెబ్బకొట్టాలో జగన్ కు బాగా తెలుసు. ఇప్పుడు జగన్ దెబ్బ రుచి చూస్తున్న వారంతా కుయ్యో మొర్రో అంటూ కూనిరాగాలు తీస్తున్నారు.


 ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎవరూ ఊహించనివి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని పదే పదే చెప్పు తిరుగుతున్న చంద్రబాబు కూడా జగన్ రాజకీయాలు ఒక పట్టాన అర్థం కావడం లేదు. గతంలో ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు కూడా ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలు.. ఏపీ రాజకీయాలు ఏవి అర్థం కావడం లేదు. తనకు అత్యంత కీలకమైన వ్యక్తులను కూడా బిజెపిలోకి పంపించి తనకు అనుకూలంగా రాజకీయాలను మార్చుకోవాలని చూశారు బాబు. బిజెపిలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన రాజ్యసభ సభ్యులు చేరవేస్తున్నా...  జగన్ ను బిజెపి చేరదీస్తుంది అన్న విషయాన్ని వారు పసిగట్టలేకపోయారు.


 జగన్ విషయంలో బిజెపి ఏ విషయాలు బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఆ విషయం అందరికీ ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. ఇక ప్రస్తుతం ఏపీలో ఐటీ దాడులు తదితర వ్యవహారాల్లో చంద్రబాబు ఏ విధంగా అయినా ఇరికించాలని ఉద్దేశంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిపోయాయి. ప్రస్తుతానికి చంద్రబాబు అండ్ కో రిలాక్స్ గా ఉన్నా ముందు ముందు మాత్రం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. జగన్ చాప కింద నీరులా ఏపీ లోనే కాకుండా కేంద్ర అధికార పార్టీలోనూ చొచ్చుకెళ్లిపోతున్నాడు. తన నిర్ణయాలకు ఎక్కడా ఆటంకం లేకుండా చేసుకుంటూ అసలు సిసలైన రాజకీయం అంటే ఏంటో రుచి చూపిస్తున్నారు. జగన్ దెబ్బకు ఆయన రాజకీయ ప్రత్యర్థులు అంతా ఇప్పుడు విలవిలలాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: