ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రెండు కులాల మధ్య ఘర్షణ పొరలాగా అన్నట్టుగా మారాయని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలు మారాలంటే సమాజంలో మార్పు రావాలంటే యువత రాజకీయాల్లోకి తప్పనిసరిగా రావాలి అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టి పోవటంతో సమాజం కూడా బ్రష్టు పట్టిపోయింది అని తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత యొక్క అవసరత రాజకీయానికి ఎంతో అవసరం ఉందని కుల రాజకీయాలు మారాలంటే సరికొత్త వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పాటు కావాలంటే కంపల్సరిగా యూత్ రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

 

కచ్చితంగా జనసేన పార్టీ యువత కి ప్రాధాన్యత ఇస్తుందని సమాజంలో మార్పు రావాలంటే ఒక్క జనసేన తోనే సాధ్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు. అమరావతి రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కోసం అప్పట్లో భూసేకరణ చేపట్టడం జరిగిందని ఆ సమయంలో 33 వేల ఎకరాలు ఇవ్వటం జరిగిందని మాట్లాడిన పవన్ కళ్యాణ్ 33వేల ఎకరాలు రాజధానికి అవసరమా అని ప్రశ్నించారు. ఇదే ప్రశ్న ఆ సమయంలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

 

ప్రస్తుతం కక్షసాధింపు రాజకీయాల వల్ల అంతిమంగా సామాన్య ప్రజలే నష్టపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పవన్. పార్టీ న్యాయ విభాగం లో మాట్లాడిన పవన్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని బతికించింది సామాన్యుడిని వారికి కవచంలా న్యాయ విభాగం పని చేయాలని కోరారు. అంతేకాకుండా న్యాయవాదుల నుండి బలమైన రాజకీయ నాయకులు రాజకీయరంగంలో రావాలని పిలుపునిచ్చారు. ఇదే సమయం జనసేన పార్టీ ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: