తెలంగాణా కాంగ్రెస్ లో ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా రేవంత్ రెడ్డి. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు కూడా స్పష్టంగా తెలుసు. అయితే ఆయనకు ఉన్న క్రేజ్ మాత్రం కొందరిని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతుంది. తమకు ఆదరణ రావడం లేదని భావిస్తున్నారు కొందరు కాంగ్రెస్ మాజీ మంత్రులు. వైఎస్ బ్రతికి ఉన్న సమయంలో తెలంగాణాలో చక్రం తిప్పిన ఎందరో నాయకులు ఇప్పుడు రేవంత్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. 

 

దీనితో ఆయన్ను కాంగ్రెస్ నుంచి పంపించే ప్లాన్ కొందరు చేస్తున్నారు. ఉత్తమ కుమార్ రెడ్డి పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సిద్దమయ్యారు. ఆయన తప్పుకుంటే మాకు కావాలి అంటే మాకు కావాలని ఒక మాజీ ఎంపీ, ఒక ప్రస్తుత ఎంపీ మీడియాలో ఎక్కువ హడావుడి చేస్తున్నారు. మాది ముఖ్యమంత్రి అయ్యే రేంజ్... అలాంటిది తమకు పీసీసి బాధ్యతలు కూడా ఇవ్వరా అంటూ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ళ తరబడి మేము కాంగ్రెస్ లో ఉన్నాము. మరి మా పరిస్థితి ఏంటీ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇదే సమయం లో మీడియా లో అనవసర లీకులు ఇస్తున్నారు. రేవంత్ కి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మద్దతు లేదని, ఆయన తో ముందుకి వెళ్ళే ఆలోచన సోనియా గాంధీకి లేదని, కాబట్టి ఇప్పుడు అధ్యక్ష పదవని ఒకరికి ఇవ్వడానికి సిద్దమయ్యారని అంటూ ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కి ఇస్తే ఆంధ్రాలో ఫాన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆయన క్రేజ్ మైనస్ అవుతుంది గాని ప్లస్ అవ్వదు అంటూ మాట్లాడుతున్నారు. ఇక ఆయనకు చంద్రబాబుతో ఉన్న పరిచయాలు కాస్తా కాంగ్రెస్ ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు వాళ్ళు. అందుకే ఆయనను పొమ్మని చెప్పకుండానే పొగ పెట్టే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: