రాజకీయాల్లో పలు విధాలైన మార్పులు వచ్చినట్లుగానే, ఎన్నికల విధానంలో కూడా రోజుకో కొత్త టెక్నాలజీ వస్తుంది.. ఇది వరకు ఓటు వేయాలంటే సిరా రాసుకుని అభ్యర్ది తాలూకు గుర్తు ఉన్న పేపర్ పై బొటన వేలి అచ్చువేయాలి. ఇలా చాలా కాలంగా అమలులో ఉన్న విధానానికి స్వస్తి పలికిన ఎన్నికల కమీషన్ ఆ తర్వాత వీవీ ప్యాట్లను అమలులోకి తెచ్చింది... ప్రస్తుతం ఈ వీవీ ప్యాట్లతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారు..

 

 

ఇకపోతే ప్రతి అయిదేళ్లకు ఓక సారి వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును ప్రతి వారు వినియోగించుకోలేక పోతున్నారు. దీనికి కారణం.. ఉద్యోగ రీత్యా వేరే ప్రదేశంలో ఉండటం.. పోలింగ్ స్టేషన్‌ అందుబాటులో లేకపోవడం ముఖ్య కారణం. ఇదే కాకుండా నాన్ లోకల్‌గా ఉన్న సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల కూడా ఓటును వినియోగించుకోలేక పోతున్నారు.. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తులు చేస్తోంది.

 

 

ఇందులో భాగంగా ఎన్నికల్లో పోలింగ్ బూత్‌కు వెళ్ళకుండానే ఓటు వేయడానికి వీలు కల్పించే అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. దీని కోసం ఐఐటీ-మద్రాస్ వారి సహకారం తీసుకుంటోంది. దీనికి సంబంధించిన వివరాలను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా వెల్లడించారు. ఇక ఎన్నికల సమయంలో.. ఎక్కడో ఉన్న ఓటర్ తన నియోజకవర్గంలో ఓటు వేయడానికి వెళ్లకుండా.. ఈసీ ముందుగా నిర్ణయించి.. ఏర్పాటు చేసిన కేంద్రానికి నిర్ణీత సమయంలో వెళ్లి  ఓటరు తన ఓటుహక్కును ఉపయోగించుకోవచ్చునట..

 

 

అయితే ఓటరు తన ఇంటి దగ్గర నుంచి ఓటు వేయవచ్చునని తప్పుగా అర్ధం చేసుకోరాదని, ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా  వివరించారు. ఇకపోతే బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించి అభివృద్ధిపరుస్తున్న, టూ-వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్, అభివృద్ధి దశలో ఉందని వివరించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: