తాను ఎన్నికల సమయంలో, పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన ప్రతీ హామీ కూడా అమలు కావాలి అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్ష. అందుకు తగిన విధంగా ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే జగన్ చాలా వరకు దూకుడుగానే వెళ్తున్నారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే తన అధికారాన్ని సంక్షేమం కోసం జగన్ వినియోగిస్తూ పేదలకు అండగా నిలబడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రతీ సంక్షేమ కార్యక్రమం కూడా అర్హులకు అందాలి అనేది జగన్ భావన. 

 

ఈ నెల 15న ఇంటింటికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపధ్యంలోనే కొత్త పెన్షన్ కార్డులనుకుడా ఇవ్వాలని భావించి ఒక ముహూర్తం పెట్టుకుంది. ఈ రోజు నుంచే ప్రభుత్వం ఈ పెన్షన్ కార్డులను లబ్ది దారులకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు వాలంటీర్లు వాటిని ఇంటింటికి వెళ్లి ఇవ్వనున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుతో ఈ కార్డులు ఇవ్వనున్నారు. పెన్షన్ తీసుకునే వారి ఫిబ్రవరి నాటికి 54,68,322 మందిగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 

 

సోమవారం నుంచి ఫిబ్రవరి 20 వరకు వారికి నాలుగు రోజుల పాటు కొత్త పెన్షన్ కార్డులు ప్రభుత్వం అందిస్తుంది. అర్హులకు పెన్షన్ బుక్ తో పాటుగా గుర్తింపు కార్డు కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే పెన్షన్ పొందే వారికి బుక్స్ కుద ఇచ్చేసారు. ఆ కార్డులో ఆధార్, ఫోన్ నెంబర్ రాసిపెట్టుకోవాలి. పెన్షన్ ఎప్పుడైనా అందకపోతే ఈ కార్డు ద్వారా పెన్షన్ డబ్బులు అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకైనా మంచిది దాన్ని జిరాక్స్ కూడా తీసిపెట్టుకుంటే తడిచినా, ఇంకేదైనా గోల ఉండదు. అందరికి పెన్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం జాగ్రతగా అడుగులు వేస్తుంది. అయితే కక్ష సాధింపుతో తమకు ఓటు వేసిన వారి పెన్షన్ ని ప్రభుత్వం తొలగిస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: