తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ 66 వ పుట్టిన రోజు వేడుకలు తెలంగాణా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన పుట్టిన రోజుకి శుభాకాంక్షలు చెప్తున్నారు. అటు తెరాస కార్యకర్తలు కూడా తమ అభిమాన నేత జన్మదిన వేడుకలను నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని కెసిఆర్ మరింత కాలం పరిపాలించి రాష్ట్ర అభ్యున్నతికి సహకారం అందించాలి అని కోరుతున్నారు. ఇక ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కెసిఆర్ కు విషెస్ చెప్తున్నారు. 

 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.” అని తెలంగాణా సిఎంవో ని ట్యాగ్ చేసారు చంద్రబాబు. ఇక పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా కెసిఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. 

 

ఇక ఆయన తనయుడు, మంత్రి కేటిఆర్ కూడా ట్వీట్ చేసారు. “తల్లిని కన్న తనయుడికి, జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayKCR అని ట్వీట్ చేసారు. “నాకు తెలిసిన బహుముఖ, చాలా ధైర్యవంతుడు, దయగలవాడు, ఆకర్షణీయమైన & డైనమిక్ మనిషికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనను నాన్న అని పిలవడం నాకు గర్వకారణం. మీరు దీర్ఘకాలం జీవించాలి. మీ దృష్టి మరియు నిబద్ధతతో మీరు మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు” అని కేటిఆర్ ట్వీట్ చేసారు. తెరాస నాయకులు పెద్ద ఎత్తున తమ నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. కెసిఆర్ పేరిట స్వచ్చంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో కెసిఆర్ మేనియా నడుస్తుంది. తెలంగాణా రాష్ట్రాన్ని మరింత ముందుకి తీసుకు వెళ్ళాలి అంటూ పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: