సమాజంలో పరిస్థితులు రోజు రోజుకీ దారుణంగా తయార‌వుతున్నాయి. చదువుకునే బడి, గుడి, పనిచేసే ఆఫీసు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ఆక‌రి త‌మ ఇంట్లో కూడా ఆడ‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ ఉండ‌డం లేదు. పసి పిల్లల దగ్గర నుంచి చావు దగ్గరైన ముసలమ్మను కూడా కొందరు కామాంధులు వదలడం లేదు. తల్లీ, చెల్లీ అనే తేడా లేకుండా తమ కామ వాంఛ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇక తాజా ఓ కామాంధుడు తండ్రి అన్న పదానికే మాయని మచ్చ తెచ్చాడు. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. మనం బతుకుతుంది మనుషుల మధ్యనేనా అనే సందేహాన్ని కలిగించే సంఘటన ఇది. 

 

బంధాలు, అనుబంధాలను మరిచి.. కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామంతో కాటేశాడు. భార్య‌కు మతిస్థిమితం లేకపోవడంతో.. కూతురిపై నిత్యం లైంగిక దాడి చేసేవాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.  దారుణ ఘటన పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో చోటుచేసుకుంది. నేపాల్ నుంచి ఓ కుటుంబం పొట్టకూటి కోసం వలస వచ్చి పటియాలాలో స్థిరపడింది. భార్యకు మతిస్థిమితం లేకపోవడంతో కూతురిపై కన్నేశాడు తండ్రి. తరచూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి మరీ కూతురిపై నీచానికి దిగాడు.

 

ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆమె ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు. కన్నతండ్రే ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కామాంధుడిపై కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి తండ్రి పరారీలోనే ఉన్నాడు. ఇక తండ్రిపై కేసు పెట్టకుండా బాలికపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. అయిన‌ప్ప‌టికీ బాలిక ధైర్యంగా ముందుకు రావ‌డంతో.. స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్న పటియాలా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే గర్భంతో ఉన్న బాలికను రాజీంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: