ఐటీ శాఖ సోదాల తరువాత ఏపీలో ప్రతిపక్ష పార్టీ అవినీతికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 సంవత్సరం నవంబర్ 11వ తేదీన ఐటీ శాఖ జరిపిన సోదాలలో ఏపీలో భారీ ప్రాజెక్టులు చేపట్టిన ఒక సంస్థ ఎన్నికలకు ముందు ఏపీలోని ఒక ప్రముఖ వ్యక్తి 150 కోట్ల రూపాయలు లంచం ఇచ్చిందన్న ఆధారాలు స్పష్టంగా బయటపడ్డాయి. తాజాగా దీనికి సంబంధించిన పూర్తి రికార్డులు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. 
 
గత కొన్నిరోజులుగా ఏపీలో జరుగుతున్న ఐటీ సోదాలు నవంబర్ లో జరుగుతున్న సోదాలకు కొనసాగింపుగానే జరుగుతున్నాయని తెలుస్తోంది. నవంబర్ లో జరిగిన దాడుల్లో తెలిసిన వివరాల ఆధారంగానే కొంతమంది వ్యక్తులపై ఈ నెలలో ఐటీ అధికారులు దాడులు చేశారని తెలుస్తోంది. 2019 నవంబర్ 11వ తేదీన సీబీడీటీ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. ఏపీకి సంబంధించిన ఒక ఇన్ ఫ్రా కంపెనీ హవాలాకు పాల్పడిందని ప్రెస్ నోట్ లో సీబీడీటీ పొందుపరిచింది. 
 
నవంబర్ లో దేశవ్యాప్తంగా 42 ప్రాంతాలలో సోదాలు జరిపి ఐటీ శాఖ మొత్తం 3300 కోట్ల రూపాయల హవాలా సొమ్ము గుట్టు రట్టు చేసింది. ఈ సోదాలలో ఏపీకి చెందిన ఇన్ ఫ్రా కంపెనీలకు లింకులు ఉన్నాయని సీబీడీటీ గత సంవత్సరం స్పష్టం చేసింది. అప్పట్లోనే సీబీడీటీ 3300 కోట్ల హవాలా సొమ్ములో ఏపీ ప్రముఖుడికి 150 కోట్ల రూపాయలు అందాయని ప్రెస్ రిలీజ్ లో తెలిపింది. 
 
3300 కోట్ల హవాలా రాకెట్ లో ఏపీ ప్రముఖుడు అందుకున్న 150 కోట్ల రూపాయలకు సంబంధించిన పూర్తి వివరాలు ఐటీ శాఖ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా చంద్రబాబు పీఎస్ పై జరిగిన ఐటీ సోదాల్లో 2000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. ఇన్ ఫ్రా కంపెనీ రికార్డుల్లో 150 కోట్ల రూపాయలు అందుకున్న ప్రముఖుడి వివరాలు కూడా త్వరలోనే బయటకు రానున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: