ఒక వయసు లో కలిగే ప్రేమ చివర వరకు ఉంటుంది. కానీ టీనేజ్ లో ఏర్పడే ప్రేమ హద్దులు దాటేలా చేస్తుంది.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి ఫలితంగా యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని పెద్దలకు తెలియకుండా నెట్టుకొస్తున్న ఆమె ఏడో నెలలో బిడ్డకు జన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.

 

 


అనంతపురం ఉరవకొండకు అమ్మాయి, అబ్బాయి కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్ల కళ్లుగప్పి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని షికార్లకు తిరిగేవారు. ఈ క్రమంలోనే శారీరకంగానూ దగ్గర కావడంతో యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు చంపేస్తారని భయపడిన బయటకు చెప్పలేదు. గర్బవతిగా ఆమె శరీరంలో వస్తున్నా మార్పులను కుటుంబ సభ్యులు కూడా పసిగట్ట లేకపోయారు. 

 

 

అలా ఆమె ఏడునెలల గర్భాన్ని మోసింది. అనుకోకుండా ఓ రోజు అమ్మాయి నొప్పులను భరించలేక గట్టిగా కేకలు వెలిసింది. దీంతో అమ్మకు అనుమానం రావడంతో ఆమెను పట్టుకొని నిలదీసింది. అప్పుడు జరిగిన విషయాన్నీ అమ్మకు చెప్పింది. బయటకు వెళ్లలేని ఆమె ఇంట్లోనే ప్రసవం అయింది. అనంతరం విషయం తెలుసుకున్న యువకుడు పోలీసులకు పిర్యాదు చేసాడు. పోలీసులు పరిగణలోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. 

 

 


ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే యువతి మగబిడ్డను ప్రసవించింది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆమెను తల్లిని చేసింది తానేనని అంగీకరించాడు. అయితే యువతి తరపున తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.తన బిడ్డను అమ్మాయిని తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పోలీసులు ఏ విదంగా స్పందిస్తారో తెలియాల్సింది. ఇలాంటి పనులను చేయరాదని యువతకు ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: