ప్రస్తుతం ఇండియాలో వైరల్ గా మారిని అంశం ఇండియన్ ఉసేన్ బోల్డ్ గా ముద్ర పడిపోయిన శ్రీనివాస్ గౌడ గురించే. కర్ణాటకలోని మంగళూరుకు  సమీపంలో ఉన్న ఖాద్రి లో జరిగిన సాంప్రదాయ కంబాల పోటీల్లో శ్రీనివాస్ గౌడ పరుగెట్టిన తీరు అతనిని ఓవర్ నైట్ ఇండియన్ స్టార్ గా మార్చేసింది. ఎందరో ప్రముఖలు గౌడ గురించి ట్విట్టర్ లో పొగిడారు. బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా కూడా అతని ప్రతిభను వెలికి తీయండని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజుకు ట్యాగ్ చేశారు.

 

 

స్పందించిన కిరణ్ రిజుజు.. ఇప్పటికే SAI అధికారులు శ్రీనివాస్ గౌడను సంప్రదించారని.. సాయ్ ఆధ్వర్యంలో సోమవారం గౌడకు ఫిట్ నెస్ పరిక్ష నిర్వహిస్తారని అన్నారు. కానీ ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తూ శ్రీనివాస గౌడ ‘కర్ణాటక సీఎం ను కలుస్తాను.. సాయ్ కి వెళ్తాను కానీ తనకు స్ప్రింటర్ గా మారేందుకు అంతగా ఆసక్తి లేదు. సంప్రదాయ కంబాల పోటీలపైనే దృష్టి పెట్టాలనుంది. మా కంబాల అకాడమీ మెంటర్ తో చర్చిస్తాను’ అని ఈ 28ఏళ్ల పరుగుల కెరటం అంటున్నాడు. ‘శ్రీనివాస్ గౌడ ఆలోచించుకునేందుకు మరికొంత సమయం ఇస్తాం. ప్రస్తుతానికైతే అతని ఫిట్ నెస్, పరుగు ట్రయిల్ కు ఇంకా తేదీ నిర్ణయించలేదు’ అని సాయ్ అధికారులు అంటున్నారు.

 

 

నిజానికి ఈ పరుగుకు, ట్రాక్ రన్నింగ్ కు తేడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నిష్ణాతులైన కోచ్ లతో గౌడకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ శ్రీనివాస్ గౌడ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. బురదలో పరుగు పెట్టే సమయంలో దున్నపోతుల వేగం కూడా కంబాల పోటీల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కర్ణాటకలోని మూడబిద్రిలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.. శ్రీనివస్ గౌడ్. మరి గౌడ నిర్ణయమేంటో..!

మరింత సమాచారం తెలుసుకోండి: