పురుషులు మహిళల్ని మోసం చేస్తే సహించరు. వారు అన్ని వేళలా విధేయతను కోరుకుంటారు. విశ్వసనీయత అనేది బంధాన్ని గట్టి పరుస్తుంది కూడా. మిత్రుల ముందు, సహోద్యోగుల ముందు మహిళలు తమ పురుషుడికి మద్దతుగా నిలుస్తారు. తమ పురుషుడు చాలా భద్రంగా ఫీలయ్యే విధంగా మహిళలు ప్రవర్తిస్తారు. మ‌హిళ‌లు ఇటు ఇంటి బాధ్య‌త‌ను అటు బ‌య‌ట ఇంట్లో ప‌ని ఒత్తిడి ఇంకా బ‌య‌ట ఉద్యోగం చేసే మ‌హిళ‌ల్లో ఆఫీస్ ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. దాంతో భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య స‌రైన అండ‌ర్ స్టాండింగ్ లేక‌పోతే కాపురాలు కూలిపోయే ప్ర‌మాదం ఉంది. 

 

భార్యా భ‌ర్త‌ల బంధం ఎంతో విలువైంది. ఒక‌రి మీద ఒక‌రికి న‌మ్మ‌కం ఉండాలి. ఏమాత్రం ఆ న‌మ్మ‌కం కోల్పోయినా.. మ‌న‌సు విరిగిపోయినా.. మ‌ళ్ళీ అతుక్కోవ‌డం చాలా క‌ష్టం. భార్య భ‌ర్త‌కు అన్ని విష‌యాల్లో ప్ర‌తి స‌మ‌యంలో అనుకూలంగా ఉండాలంటే సాధ్య‌ప‌డ‌ని విష‌యాలు, సంఘ‌ట‌న‌లు ఎన్నో ఉంటాయి. వాటిని అర్ధం చేసుకుంటూ స‌ర్దుకుపోవాలి త‌ప్పించి. ఏనాడు త‌ప్ప‌డు అడుగులు వేయ‌కూడదు. దానివ‌ల్ల జీవితాలు నాశ‌నం అయిపోతాయి. ఏ భార్య అయినా స‌రే త‌న భ‌ర్త మీద ప్రాణాలు పెట్టుకుని భ‌ర్తే సర్వ‌స్వంగా బ్ర‌తుకుతూ ఉంటుంది. కానీ ఆ భ‌ర్తే త‌న‌ను మోసం చేస్తే  భార్య స‌హించ‌లేదు. ఆడ‌దాని మ‌న‌సు ఎంతో సున్నితంగా ఉంటుంది. భ‌ర్త మోసం చేస్తే భార్యకు త‌ట్టుకునేంత శ‌క్తి ఉండ‌దు. అందులోను ఈ రోజుల్లో ఆడ‌పిల్ల‌లు చాలా సున్నిత స్వ‌భావం క‌లిగి ఉంటున్నారు. భ‌ర్త ఏ చిన్న విష‌యంలో త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు అని తెలిసినా గొడ‌వ‌ప‌డేవారు ఉన్నారు. స‌ర్దుకుపోయే గుణం నేటి మ‌హిళ‌ల్లో చాలా త‌క్కువ‌గా ఉంటుంది. భ‌ర్త ప‌రాయి స్త్రీతో శారీర‌క సంబంధం ఉంద‌ని తెలిస్తే ఏ భార్యా స‌హించ‌దు. జీవితంలో ఆ భ‌ర్త మొహం చూడ‌టం కాదు క‌దా ఆ భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వెళ్ళాల‌న్నా అస‌హ్యించుకునే ఆడ‌వారు చాలా మందే ఉంటారు. తాను ఎంత క‌రెక్ట్‌గా ఉంటుందో త‌న భ‌ర్త కూడా అలానే ఉండాల‌నుకుంటారు. 

 

ఇందులో కూడా రెండు ర‌కాల ఆడ‌వారు ఉన్నారు. కొంద‌రు భ‌ర్త ఏం చేసినా స‌ర్దుకుపోయి కాపురాలు చేసేవారు ఉంటే.. మ‌రి కొంద‌రు పెద్ద‌వారికి చెప్పి ఆ గొడ‌వ‌ని మ‌రింత పెద్ద‌గా చేసి సంసారం తెగే వ‌ర‌కు తీసుకువ‌స్తారు. ఇంకొంత మంది అటు త‌ల్లిదండ్రుల‌కి ఎవ్వ‌రికీ చెప్ప‌లేక భ‌ర్త‌తో ఉండ‌లేక త‌మ‌లో తామే కుమిలిపోతారు. భ‌ర్త గురించి చెప్ప‌డం ఏదైనా నిమిషం పాటు ప‌ని కాని ఒక‌సారి త‌న భ‌ర్త గురించి పుట్టింటి వారికి తెలిస్తే భ‌ర్త ప‌రువు ఏమ‌వుతుందా అని అక్క‌డ కూడా భార్య త‌న భ‌ర్త గురించే ఆలోచిస్త‌ది. చాలా మంది మ‌గ‌వారు భార్య అంటే ఏదో డ‌బ్బులు సంపాదించే మిషెన్‌లాగా, పిల్ల‌ల‌ను క‌నిపెట్టే యంత్రంలాగా చూస్తారు గాని భార్య యొక్క విలువ‌ను తెలుసుకోలేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: