ఈరోజు అనగా సోమవారం నాడు వైసిపి నేత, తెలుగు సినీ యాక్టర్ అయిన జయసుధ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు విజయవాడలో నివాసం ఉంటున్న ఇంటికి జయసుధ తన సోదరి శుభాషిణి తో కలిసి వెళ్లారు. అయితే 2017 వ సంవత్సరం లో జయసుధ భర్త చనిపోయారు. అప్పటినుండి జయసుధ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అన్న సంగతి మనకు తెలిసిందే. అయితే జయసుధ తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని కలవగానే మళ్ళీ ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నరా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.




కానీ అసలు విషయం ఏమిటంటే ఆమె టిడిపి పార్టీ లో జాయిన్ అవ్వడం లేదు. అయితే చంద్రబాబు నాయుడు ని జయసుధ కలిసింది మాత్రం కేవలం తన ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి పిలవడం కోసమని స్పష్టమయ్యింది. చంద్రబాబు నాయుడుతో సహా తన ఇంటి కుటుంబ సభ్యులంతా తన పెద్ద కొడుకు నిహార్ పెళ్లి వేడుకలకు రావాలని జయసుధ చంద్రబాబు నాయుడు ని కోరారు. నిహార్ ఢిల్లీ లో నివసించే అమిత్ కౌర్ ని ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నాడు. జయసుధని మరొక కొడుకు కూడా ఉన్నాడు అతని పేరు శ్రియం కపూర్.




ఇకపోతే దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసినప్పుడు.. జయసుధ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. చాలా రోజుల వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆమె టిడిపి పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్లీ 2019 ఎలక్షన్ టైంలో జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ పార్టీలో ఆమె జాయిన్ అయ్యారు. ఏదేమైనా జయసుధ కేవలం తన కొడుకు పెళ్లి శుభకార్యానికి చంద్రబాబుని ఇన్వైట్ చేశారు తప్ప మరేతర రాజకీయ విషయాలు మాట్లాడడానికి కలవలేదని తేలిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: