జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో తప్పటడుగు వేస్తున్నాడు. మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలీదు కానీ వాళ్ళ మాటలు వింటే పవన్  సాంతం ముణిగిపోవటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం నుండి పోటి చేయబోతున్నట్లు ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుండి పోటి చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

 

నిజానికి అప్పుడు రెండు నియోజకవర్గాల్లో పోటి చేయటమే పవన్ చేసిన తప్పు. రెండు చోట్ల పోటి చేయటమంటేనే ఒక నియోజకవర్గంలో ఓటిమి భయమే కారణమంటూ బాగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే పై రెండు నియోజకవవర్గాల్లోను వైసిపి చాలా బలంగా ఉంది. కాబట్టి పై రెండు నియోజకవర్గాల్లో పవన్ గెలుపు అనుమానమే అనే ప్రచారం కూడా పెరిగిపోయింది.

 

నిజానికి పవన్ గెలవాలంటే తిరుపతి నియోజకవర్గం మాత్రమే సేఫ్ నియోజకవర్గమని కొందరు చేసిన సూచనలను పట్టించుకోలేదు. తిరుపతి ఎలా సేఫంటే అక్కడి టిడిపి అభ్యర్ధి సుగుణమ్మ, వైసిపి క్యాండిడేట్ భూమన కరుణాకర్ రెడ్డిపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. పైగా తిరుపతిలో సింగిల్ లార్జెస్ట్ సామాజికవర్గంగా బలిజలున్నారు. బలిజ ఓటర్లే సుమారు 40 వేల మందుంటారు. బలిజల ఓట్లు+టిడిపి, వైసిపి అభ్యర్ధులపై వ్యతిరేకత+న్యూట్రల్ ఓట్లు వస్తే పవన్ గెలుపు ఈజీ. ఇంతమంచి అవకాశాన్ని కళ్ళ ముందు పెట్టుకుని తనంతట తానుగా గెలుపు అవకాశాన్ని చెడగొట్టుకున్నాడు.

 

వచ్చే ఎన్నికల్లో పోటిపై పవన్ తాజాగా చేసిన ప్రకటన చూసిన తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడనే అనిపిస్తోంది. ఎలాగంటే తాడేపల్లి గూడెంలో వైసిపి తరపున మొన్న గెలిచిన కొట్టు సత్యనారాయణ కూడా గట్టి నేతే. పైగా కాపు సామాజికవర్గానికే చెందిన నేత. కాబట్టి పవన్ గెలుపు అంత సులభం కాదు. అదే తిరుపతిలో పోటి చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్షేత్రస్ధాయిలో వాస్తవాలను తెలుసుకోకుండా  సలహాలిస్తున్న వాళ్ళు పవన్ ను నిండా ముంచేయటం ఖాయమనే తెలిసిపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: