జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బిజెపి నేతలు మండిపోతున్నారు. ఢిల్లీలో బిజెపిని ఘోరంగా ఓడించిన ఆమ్ ఆద్మి పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు చెప్పటంతో కమలనాధులు మండిపోతున్నారు. అలాగే ఎంతో బలమైన బిజెపిని ఆప్ మట్టి కరిపించటం తనకు చాలా సంతోషం వేసిందన్నారు. ఒకవైపు బిజెపికి మిత్రపక్షంగా ఉంటూ ఆప్ ను అభినందించటం ఏమిటో కమలనాధులకు అర్ధం కావటం లేదు.

 

ఢిల్లీ ఎన్నికల్లో గెలుపును  నరేంద్రమోడి ఎంతటి ప్రతిష్టగా తీసుకున్నారో అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో కేజ్రీవాల్ ను ఓడించటమే టార్గెట్ గా దాదాపు 200 మంది ఎంపిలను  రంగంలోకి దించారు. వీళ్ళు కాకుండా కేంద్రమంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులను ప్రతి నియోజకవర్గంలోను దింపారు. వీళ్ళు కాకుండా ప్రతి రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉధృతంగా ప్రచారం చేశారు. వీళ్ళందరిపైనా మోడి బహిరంగసభల్లో పాల్గొన్నారు.

 

బిజెపి వైపు ఇంతమంది ఎన్నికల రంగంలోకి దిగితే ఆప్ తరపున కేవలం కేజ్రీవాల్ మాత్రమే ప్రచారం చేశారు. అయినాసరే మోడికి ఎంతటి పరాభవం ఎదురయ్యిందో అందరూ చూసిందే. దాంతో వ్యక్తిగతంగా మోడికి పార్టీగా బిజెపికి కోలుకోలేని దెబ్బ తగిలినట్లే అనుకోవాలి. దాంతో మొత్తం బిజెపి తీరని అవమానం జరిగినట్లుగా ఫీలవుతుంటే  మరోవైపు ఆప్ ను పవన్ అభినందించటంతో ఒక్కసారిగా షాక్ ఫీలయ్యారు.

 

అసలు కేజ్రీవాల్ ను అభినందించాల్సిన అవసరం పవన్ కు ఏమిటో బిజెపి నేతలకు ఏమాత్రం అర్ధం కావటం లేదు.  ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ ను అభినందించే ముందు బిజెపి నేతల యాంగిల్ లో పవన్ ఆలోచించలేదన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. అదే సమయంలో ఏపిలో జరిగిన  ఐటి రెయిడ్లపై బిజెపి నేతలు చంద్రబాబుపై రెచ్చిపోతుంటే అసలు దాడులు జరగటమే తప్పన్నట్లు మాట్లాడారు.  దాంతో పవన్ మైండ్ సెట్ ఏమిటో అర్ధమవుతున్న బిజెపి నేతలు మండిపోతున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: