తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన మాజీ పిఎ శ్రీనివాస్ చౌదరి దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు దొరికినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఇటీవల ఐటీ అధికారులు చేసిన దాడుల్లో చంద్రబాబు మాజీ పిఎ శ్రీనివాస్ చౌదరి వద్ద రెండు వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన దొరికినట్లు వార్తలు రావడంతో అధికార పార్టీ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. చంద్రబాబు పిఏ దగ్గర రెండు వేల కోట్లు దొరికితే చంద్రబాబు దగ్గర ఇంకా ఎన్ని లక్షల కోట్లు ఉంటాయో అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో కాంట్రాక్టర్ల విషయంలో ఇంకా అనేక విషయాలలో భయంకరమైన అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.

 

ఇదే తరుణంలో ప్రతిపక్షంలోనే ఉన్న సమయంలో రాజధాని అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేసిన వైసిపి కేవలం ఆరోపణలు కే పరిమితం అవుతుంది. ఇప్పుడు ఇదే విధంగా రెండు వేల కోట్ల రూపాయల విషయంలో కూడా విమర్శలు చేస్తున్న వైసీపీ ఏ మాత్రం రుజువు చేయడానికి ముందుకు రావడం లేదు. మరోపక్క తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే అనే భారీ ట్విస్ట్ ఇస్తూ... ఐటి అధికారుల సోదాల్లో దొరికినట్లు మీడియా ముందు వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో రెండు వేల కోట్ల లేకపోతే 2 లక్షల అన్న దాని విషయంలో మాత్రం ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. మరోపక్క వైసిపి పార్టీ నాయకులు మాత్రం కేవలం ఆరోపణ మంత్రాన్ని జపిస్తున్నారు. అధికారంలో ఉన్నా గానీ ముందడుగు వేయకపోవడంతో...రెండు వేల కోట్ల కుంభకోణం కేసులో టీడీపీ కి వైసీపీ లాలూచీ పడిపోయింది అనే వాదన సరికొత్తగా వినబడుతుంది. ముందునుండి వైసీపీ పార్టీ వ్యవహారం అమరావతి విషయంలో అదే విధంగా భూములు కొనుగోలు విషయం తాజాగా రెండు వేల కోట్ల ఐటీ రైడ్ విషయాలలో తెలుగు దేశం పార్టీ కేవలం ఆరోపణల కే పరిమితం కావడంతో...వైసిపి టిడిపి రెండు కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: