ఆంధ్రప్రదేశ్ లో మండలి రద్దు వ్యవహారం ఎవరికి ఏ విధంగా షాక్ ఇచ్చిందో తెలియదు గాని తెలుగుదేశం పార్టీకి మాత్రం చుక్కలు చూపిస్తుంది. అసలే శాసన సభలో బలం లేదు రా బాబూ అనుకుంటున్న ఆ పార్టీకి ఈ పరిణామం మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు చేసింది. రాజధాని బిల్లుని అడ్డుకున్నందుకు గాను జగన్ ఇక మండలి తో అవసరం లేదని భావించి సాగనంపే కార్యక్రమం చేసారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఈ పరిణామం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

జగన్ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం మండలి లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల్లో చాలా మంది పార్టీకి 2004 నుంచి 2014 వరకు ఆర్ధికంగా అండగా నిలబడిన వారే. దాదాపు 10 మంది వరకు పార్టీకి ఆర్ధిక సహాయం చేసారు. వారిని చంద్రబాబు మండలికి పంపి ఋణం తీర్చుకున్నారు. సరే అంతా బాగుంది అనుకున్న తరుణంలో అధికారం కోల్పోవడం, అధికారం కోల్పోయిన వెంటనే మండలి రద్దు నెలల వ్యవధిలో జరగడం తో షాక్ అయ్యారు. 

 

దీనితో ఇప్పుడు వాళ్ళు చంద్రబాబుని వేధిస్తున్నట్టు సమాచారం. మీ సలహాలు విని మేము మండలిలో బిల్లుని వ్యతిరేకి౦చాం అని ఇప్పుడు ఈ పరిణామం తో తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది అని, జగన్ కక్ష సాధింపు దెబ్బకు తాము వ్యాపారాల్లో కూడా నష్టపోయామని, భవిష్యత్తులో తమకు చీకటి మినహా ఏమీ కనపడటం లేదు అని వాపోతున్నారట. అందుకే చంద్రబాబు ఒకసారి మీరు అందరూ ఢిల్లీ వెళ్లి కేంద్రం తో మాట్లాడాలి అని, రాష్ట్రపతిని కలిసి మీ ఆవేదన అంతా చెప్పాలని చంద్రబాబు వారికి సూచించారట. దీనితో వారు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: