2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ మెజారిటీ ని సొంతం చేసుకుని ఘన విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న టిడిపి పార్టీ మాత్రం కనీసం ప్రతిపక్ష హోదాకి సరిపడే సీట్లను కూడా దక్కించుకోలేక పోయింది. ఇదిలా ఉంటే... 23 మంది తో నైనా టీడీపీని ముందుకు నడిపించాలని చంద్రబాబు అనుకుంటున్న సమయంలో... టిడిపి పార్టీకి చెందిన కీలక నేతలు అందరూ వరుసగా పార్టీని వీడటం మొదలుపెట్టారు. టిడిపి పార్టీ ఎంపీలు బీజేపీలో చేరడం... టిడిపి పార్టీ కీలక నేత వల్లభనేని వంశీ పార్టీని వీడి చంద్రబాబు పైన విమర్శలు చేయడం. టిడిపి యువత విభాగం అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీ పార్టీలో చేరడం. ఇలా 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు కు భారీ షాక్ లు తగులుతు వస్తున్నాయి. 

 

 ఈ క్రమంలోనే టిడిపి పార్టీ పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోతుంది.ఇదిలా ఉంటే తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస సమక్షంలో  300 మంది బీజేపీ కార్యకర్తలు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా విశాఖ వేదికగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్... టిడిపి పార్టీ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు.. ద్వితీయ శ్రేణి నేతలు తమ పార్టీలో చేరడం శుభపరిణామం అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అభివర్ణించారు. 

 

 భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా చేరికలు స్థానిక సంస్థల ఎన్నికల కోసం మరింత బలం చేకూర్చాయని  వ్యాఖ్యానించిన మాజీ మంత్రి గంటా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈనెల 19 నుంచి వార్డుల వారీగా 45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. కాగా  ఇప్పటికే ఆంధ్ర రాజకీయాలు గడ్డు పరిస్థితుల్లో ఉన్న టిడిపి పార్టీ లోకి.. కొద్దో గొప్పో బాగానే ఉన్నా బిజెపి పార్టీ నుండి భారీ మొత్తంలో చేరికలు జరగడం ప్రస్తుతం ఆసక్తిని సంతరించుకుంది.అంతేకాకుండా  జనసేన కలవడంతో మరింత బలం గా మారిన బీజేపీ నుంచి... రోజురోజుకు బలహీనంగా మారుతున్న  టిడిపి పార్టీ లోకి చేరికలు జరగడం వెనుక ఆంతర్యం ఏమిటో అని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: