దటీజ్ జగన్మోహన్ రెడ్డి అనిపించుకున్నారు. తనకు కావాల్సిన అధికారిని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే  ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను కోరుకున్నారు. తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న స్టీఫెన్ కావాలంటూ  ముఖ్యమంత్రి కేసియార్ ను కూడా అడిగారు. కేసియార్ కూడా ఓకే చెప్పేశారు.  వెంటనే స్టీఫెన్ ను తెలంగాణాలో  రిలీవ్ చేసి ఏపికి పోస్టింగ్ ఇవ్వాలంటూ కేసియార్ , జగన్ కేంద్రానికి లేఖలు కూడా రాశారు.

 

కేంద్రం నుండి ఎటువంటి ఆదేశాలు రాకుండానే  అనధికారికంగా స్టీఫెన్ కొద్ది రోజులు ఏపిలో బాధ్యతలు కూడా చూశారు. అయితే విచిత్రమేమిటంటే స్టీఫెన్ డిప్యుటేషన్ కు కేంద్రం అంగీకరించలేదు. ఏదో సాంకేతిక కారణాలు చూపి డిప్యుటేషన్ కుదరదని కేంద్రం తేల్చేసింది. దాంతో చేసేది లేక చివరకు ఐపిఎస్ అధికారి కూడా తెలంగాణాలో మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకుని ఉద్యోగం చేసుకుంటున్నారు.

 

సీన్ కట్ చేస్తే  తాజాగా స్టీఫెన్ రవీంద్రను ఏపికి డిప్యుటేషన్ ఇవ్వటానికి అంగీకరించినట్లు సమాచారం. హఠాత్తుగా స్టీఫెన్ ను డిప్యుటేషన్ కు అనుమతిస్తు కేంద్రం ఎందుకు అంగీకరించినట్లు ? ఎందుకంటే జగన్ పట్టుబట్టి సాదించుకున్నారు కాబట్టి.  ముందు కుదరదన్న కేంద్రం తర్వాత అంగీకరించటంలో జగన్ పట్టుబట్టి సాధించినట్లు సమాచారం. ముందు నరేంద్రమోడితో తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటి జరిపిన విషయం తెలిసిందే.

 

అమిత్ తో భేటి సందర్భంగా  స్టీఫెన్ విషయాన్ని జగన్ ప్రస్తావించారట. స్టీఫెన్ ఏపిలో విధులు నిర్వర్తించాల్సిన అవసరాన్ని జగన్ గట్టిగా చెప్పారట. దాని ఫలితమే రెండు రోజుల్లో  ఐపిఎస్ అధికారి డిప్యుటేషన్ కు అంగీకరించింది. ఎప్పుడైతే ఢిల్లీలోని డివోపిటి స్టీఫెన్ డిప్యుటేషన్ అంగీకరించిందో ఉత్తర్వులు రావటం, ఆయన జాయిన్ అవటం అంతా లాంఛనమే. స్టీఫెన్ డిప్యుటేషన్ కు కేంద్రం అంగీకరించిందని తెలియగానే సోషల్ మీడియాలో దటీజ్ జగన్ అంటూ ఒకటే పోస్టులు పడుతున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: