ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన వైరస్ కరోనా. చైనా దేశంలోని ఊహన్  నగరంలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం చైనా దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది.దీంతో చాలామంది ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతే.. 65 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇక ఈ వైరస్ బారిన పడని ప్రజలు కూడా ఇక్కడ తమకు ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకుతుందో  అని ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. చైనాలో విలయతాండవం చేస్తున్న ఈ ప్రాణాంతకమైన కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను కూడా బెంబేలెత్తిస్తున్నది . 

 

 పఎన్ని  ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది ప్రాణాంతకమైన వైరస్. అయితే చైనా ప్రజలందరూ కరోనా  వైరస్ ఎఫెక్ట్ తో అప్రమత్తంగా ఉంటున్నారు. శుభ్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారంతా శానిటరీ నాప్కిన్లు,  ఫేస్ మాస్కులు హ్యాండ్ వాష్ లంటూ  ఎంతగానో శుభ్రత పాటిస్తున్నరు. చైనాలోని ఊహన్ లో  పుట్టిన ఈ మహమ్మారి వైరస్ బారిన పడకుండా... ప్రజలంతా తగిన శుభ్రత పాటిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు . ఇక చైనా లోని పలు ప్రాంతాలలో అయితే ఇంట్లోనుండి కాలు  కూడా బయటకు పెట్టాలంటే భయపడుతున్నారు. ఇక ముఖ్యంగా ఊహన్  నగరంలో మామూలు సమయాల్లో ఎప్పుడూ జనసంద్రంగా ఉండేది . కానీ కరోనా ఎఫెక్ట్ తో  ఇప్పుడు మాత్రం వుహాన్  రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయయి . ఒకవేళ ఏదైనా తప్పనిసరి అయి బయటకు రావాల్సి వస్తే మాత్రం ఫేస్ మాస్క్ లు  తప్పనిసరి.. లేకపోతే కరోనా  వైరస్ సోకిడమేమో  కానీ జైలు పాలు కావాల్సిందే. 

 

 కేవలం మనుషులకే కాదు పెంపుడు జంతువులకు కూడా ఫేస్ మాస్కులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పెంపుడు పిల్లి ఫేస్ మాస్క్ తో రోడ్లపై తిరుగుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఈ ఫోటో ఎంతో మందిని ఆకర్షిస్తోంది... వందల్లో దీనిపై కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికీ పిల్లలను ప్రేమిస్తున్నారని మనం ప్రేమించే వారిని రక్షించుకోవడం మన బాధ్యత అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో చూస్తుంటే ఊహన్ లో  కరోనా ఎఫెక్ట్ ఎంతగా ఉందో అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: