చైనా దేశంలో మరణ మృదంగం మోగిస్తూ వేల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటున్న వైరస్ కరోనా . చైనా దేశంలోని ఊహన్  నగరంలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం చైనా దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది.దీంతో చాలామంది ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతే.. 65 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇక ఈ వైరస్ బారిన పడని ప్రజలు కూడా ఇక్కడ తమకు ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకుతుందో  అని ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. చైనాలో విలయతాండవం చేస్తున్న ఈ ప్రాణాంతకమైన కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను కూడా బెంబేలెత్తిస్తున్నది . 

 


 అయితే ఇప్పటికే ఈ వైరస్... భారతదేశంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కేరళలో ముగ్గురికి కరోనా వ్యాధి సోకినట్లు గా నిర్ధారించారు. అక్కడక్కడ పలు నగరాలలో కూడా కరోనా వైరస్ అనుమానితులు  రోజురోజుకు ఎక్కువైపోతున్నారు.  ఈ నేపథ్యంలో భారత ప్రజల్లో  కూడా కరోనా  భయంతోనే బతుకుతున్నారు. ఏం చేయాలన్న వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు అటు  సోషల్ మీడియాలో కూడా అది చేస్తే కరోనా వస్తుంది..ఇది తింటే   కరోనా  వస్తుంది అంటూ తీవ్రస్థాయిలో అసత్య ప్రచారాలు జరుగుతుండటంతో.. ప్రజలు మరింత అయోమయంలో పడిపోయారు.


 ఇకపోతే కరోనా వైరస్ కు సంబంధించి తాజాగా... అఖిలభారత హిందూ మహాసభ జాతీయ నేత స్వామి చక్రపాణి మహారాజ్ సంచలన వ్యాఖ్యలు. ప్రపంచ దేశాలన్నింటికీ ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్... అసలు వైరస్ కాదని... జంతువులను కాపాడేందుకు దిగివచ్చిన అవతారం అంటూ... అఖిల భారత హిందూ మహాసభ జాతీయ నేత స్వామి చక్రపాణి మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూగజీవాలను చంపి తినే వారిని దండించేందుకు... ప్రాణభయం చెప్పేందుకు వచ్చిన అవతారమే కరోనా  వైరస్ అంటూ  ఆయన వ్యాఖ్యానించారు. వీలైతే కరోనా  విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూగజీవాలకు ఇంకెప్పుడూ హాని చేయము  అంటూ ప్రతిజ్ఞ చేస్తే .  కరోనా వైరస్ తన లోకాలకు వెళ్లి పోతుంది అంటూ చక్రపాణి మహారాజు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: