ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రధాని మోడీ ని కలవడం జరిగింది. దాదాపు మూడు నెలల తర్వాత జగన్ ప్రధాని మోడీ తో భేటీ కావడం జరిగింది. దాదాపు ఈ ఇద్దరి మధ్య గంటకుపైగా చర్చలు జరగటంతో జగన్ మోడీల భేటీ జాతీయస్థాయిలో హైలెట్ అయ్యింది. ఆ తర్వాత రెండోసారి ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఇంకా కేంద్ర న్యాయ శాఖ మంత్రితో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు జగన్. ముఖ్యంగా అమిత్ షా తో భేటీ అయిన సందర్భంలో మూడు రాజధానులు గురించి అదేవిధంగా శాసన మండలి రద్దు నిర్ణయం గురించి జగన్ చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జగన్ ఢిల్లీ టూర్ చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి వివిధ పారిశ్రామిక కంపెనీలు ముందుకు రావటం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

గత కొన్ని రోజుల నుండి పెట్టుబడులను పెట్టడానికి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి జగన్ చేసిన కృషికి తాజాగా ప్రతిఫలం దక్కినట్లు సమాచారం. రాష్ట్రంలో లక్ష కోట్లకు పైగానే పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. రాష్ట్ర రాజధాని విశాఖకు మారుతున్న నేపథ్యంలో అక్కడ పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి భారీగా ముందుకు వచ్చాయి. ప్రముఖ ongc సంస్థ విశాఖ... రాజమండ్రిలో దాదాపు 78 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పెట్టుబడులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో  ongc సంస్థ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇంకా పలు రకాల సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. హిందుస్థాన్ పెట్రోలియం మరియు వేరొక సంస్థ భాగస్వామ్యంతో కాకినాడలో 32 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.

 

ఇంకా కొన్ని ఆయిల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం కోసం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నట్లు వీటన్నిటి వెనుక సీఎం జగన్ కృషి ఎంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం గ్యారెంటీ అనే టాక్ దేశ స్థాయి లో మరియు రాష్ట్ర స్థాయిలో వినబడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: