తెలంగాణాలో అన్ని శాఖల ఎన్నికలు ముగిసాయి.. అయినా కానీ ఇప్పటి వరకు నిరుద్యోగులకు తీపికబురు అందలేదని ఎదురు చూస్తున్న వారికి, తెలంగాణ ప్రభుత్వం త్వరలో గుడ్‌న్యూస్  చెప్పడానికి సిద్దం అవుతుందట.. అదేమంటే. సీడీఎంఏ పరిధిలో 128 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 3 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు లెక్కతేల్చారు.. ఇందుకు గాను ఈ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయని తెలుస్తుంది..

 

 

ఇకపోతే కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ పోస్టులు అలాట్‌‌ చేయనున్నారట. పాత మున్సిపాలిటీల్లో ఉన్న ఖాళీలను కూడా వీటితో కలిపి ఫిలప్​ చేసేందుకు ప్రపోజల్స్‌‌ సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 40 వేల జనాభా గల మున్సిపాలిటీలో కనీసం 36 పోస్టులు అవసరముండగా, కొత్త మున్సిపాలిటీల్లో ముగ్గురు, నలుగురుకు మించి అధికారులు, సిబ్బంది లేరు. ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తలపెట్టడంతో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని సీఎం ఇదివరకే హామీ ఇచ్చారు.

 

 

ఈనేపథ్యంలోనే దానికి అవసరమైన ప్రాసెస్​ను కమిషనర్ ​అండ్​ డైరెక్టర్​ ఆఫ్​ మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్ ​అధికారులు మొదలుపెట్టారు. ఇకపోతే 2018లో 173 గ్రామ పంచాయతీలు 75 కొత్త మున్సిపాలిటీలుగా మారగా, మరో 131 గ్రామ పంచాయతీలు 42 పాత మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఆఫీసర్‌‌, సీనియర్‌‌ అసిస్టెంట్‌‌, జూనియర్‌‌ అసిస్టెంట్‌‌, బిల్‌‌ కలెక్టర్లు 240 మందిని మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేటివ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో మెర్జ్‌‌ చేస్తూ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ ‌13 న జీఓ ఇచ్చింది.

 

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కోసం వంద ఇంజనీర్‌‌ పోస్టులు అవసరమని అంచనా వేశారు. మిగతా 2,900 మినిస్టీరియల్‌‌ పోస్టులు భర్తీ చేస్తే ఆయా పట్టణాల్లో అడ్మినిస్ట్రేషన్​ వ్యవహారాలు సాగించడానికి వీలవుతుందని ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. ఇకపోతే ఇప్పుడున్న ప్రతిపాదనలోని పోస్టులను టీఎస్‌‌పీఎస్సీ ద్వారా ఫిలప్​చేస్తారా, లేదా వేరే రిక్రూటింగ్‌‌ అథారిటీకి అప్పగిస్తారా అనే విషయంలో క్లారిటీ లేదని, తెలంగాణ ప్రభుత్వమే ఈ రిక్రూట్‌‌మెంట్‌‌పై  తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: