ఐటీ శాఖ తీగలాగితే చంద్రబాబు కమీషన్ల  బాగోతంలో స్వల్ప భాగం రూ.రెండు వేల కోట్లకుపైగా అవినీతి బట్టబయలైంది.  ఒక్కో డాక్యుమెంట్‌ ద్వారా రూ.కోట్లలో కమీషన్లు చేతులు మారినట్లు ఐటీ శాఖ గుర్తించింది. దీనితో టీడీపీ నేతలు ప్రజలను నుంచి ఈ కమీషన్ల దందా వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు  తంటాలు పడుతున్నారు. అసలు ఏపీలో ఐటీ సోదాలు జరగడానికి మూలమిదే. గతేడాది నవంబర్‌లో ఢిల్లీ, ముంబై, ఈరోడ్, పుణె, ఆగ్రా, గోవాలలో భారీ మౌలిక సదుపాయాల సంస్థల (కాంట్రాక్టు సంస్థలు) కార్యాలయాల్లో ఐటీ శాఖ 42 చోట్ల సోదాలు నిర్వహించింది. బోగస్‌ బిల్లుల ద్వారా రూ.3,300 కోట్లకుపైగా కమీషన్లు చేతులు మారినట్లు గుర్తించింది.

 

ఓ కాంట్రాక్టు సంస్థ నుంచి ఏపీలో ప్రముఖుడికి రూ.150 కోట్లకుపైగా ముడుపులు ముట్టాయనడానికి పక్కాగా ఆధారాలు సేకరించినట్లు 2019 నవంబర్‌ 11న కేంద్ర ప్రత్యక్ష పెట్టుబడుల మండలి(సీబీడీటీ) అధికార ప్రతినిధి సురభి అహ్లూవాలియా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. కమీషన్ల రూపంలో వసూలు చేసిన నల్లధనాన్ని సింగపూర్‌కు తరలించి.. అక్కడి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్సులోకి రప్పించి ఎవరి జేబుల్లోకి వెళ్లాయన్నది పీఎస్‌గా పనిచేసిన వ్యక్తి ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. వీటి ఆధారంగా ‘బిగ్‌బాస్‌’ అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తోంది.

 

తాత్కాలిక సచివాలయం, పట్టణ పేదల గృహ నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ పనులను టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా ఏపీ ప్రముఖుడు ముడుపులు అందుకున్నాడని విచారణలో వెల్లడైంది.  బిగ్‌బాస్‌ అక్రమాల బాగోతంలో స్వల్ప భాగాన్ని ఐటీ శాఖ రట్టు చేయడం కలకలం రేపడంతో.. వాటిని వక్రీకరిస్తూ కమీషన్ల  బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ నేతలు కిందామీదా పడుతున్నారు. ఏపీకి చెందిన ముఖ్యనేతకు రూ.150 కోట్లు చెల్లించినట్లు పేర్కొంటూ 2019 నవంబర్‌లో సీబీడీటీ విడుదల చేసిన నోట్‌ పేర్కొనడం గమనార్హం.

 

తాము జరిపిన సోదాల్లో వందలాది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు పంచనామాలోని ఐదో పేజీలో పేర్కొన్న ఐటీ శాఖ. అయితే  శ్రీనివాస్‌కు, టీడీపీకీ సంబంధం లేదని తొలుత బుకాయించిన ఆ పార్టీ నేతలు ఐటీ శాఖ విడుదల చేసిన పంచనామాలో కేవలం ఒక పేజీని మాత్రమే చూపుతూ దాడుల్లో ఏమీ దొరకలేదంటూ బుకాయిస్తుండటం పచ్చ తమ్ముల స్టయిల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: