జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలను మరియు ఇటు రాజకీయాలను ఒకే క్రమంలో షెడ్యూలు చేసుకొని చాలా బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే కేవలం రాజకీయాల్లోనే ఉంటానని సినిమాల జోలికి ఇక వెళ్ళను అని గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టిన నేపథ్యంలో వచ్చిన ప్రశ్నలకు ఎప్పుడో సమాధానం ఇచ్చేశారు.

 

తన పార్టీ ఆర్థిక పుష్టి కోసం మరియు తన కుటుంబం శ్రేయస్సు కోసం తాఉ సినిమాలు చేస్తున్నానని అదేమీ తనకి సరదా కాదు అని పవన్ తేల్చిచెప్పారు. ఇకపోతే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని నేపథ్యంలో ఇక ఆంధ్రరాష్ట్రంలో జనసేన కు ఎదురు లేదు అని అందరూ అనుకుంటూ ఉన్నారు.

 

అయితే రెండు రోజుల వ్యవధిలోనే జగన్ ఢిల్లీకి వెళ్లి అటు నరేంద్ర మోడీని మరియు అమిత్ షా ఇద్దరినీ కలవడంతో రాజకీయ సమీకరణాలు మొత్తం పూర్తిగా మారిపోయాయి. సమావేశాలు జరిగిన నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు తథ్యం అని.... మరియు జనసేన బిజెపి కలిసి ఉండగా వైసీపీ ఎన్డీయే లోకి అడుగు పెట్టిన మరుక్షణం పవన్ కళ్యాణ్ ను భారతీయ జనతా పార్టీ అస్సలు పట్టించుకోరు అని ప్రచారం జరుగుతోంది.

 

ఇదే సమయంలో కొంతమంది పవన్ బిజెపితో పొత్తు తెంచుకొని వెంటనే తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడంకోసం సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు నాయుడు సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఉన్న నేపథ్యంలో పొత్తుకి అతనే కరెక్ట్ అని పవన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

 

అయితే పవన్ మరియు బిజెపి నేతలు అందరూ వారి పొత్తు పైన విపరీతమైన నమ్మకంతో ఉండగా ఇటువంటి విషప్రచారం ఎవరు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. పవన్ అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో చేతులు కలపను అని తేల్చి చెప్పేశాడు. కానీ పవన్ ఆత్మస్థైర్యాన్ని మరియు వారి పార్టీ యొక్క బలాన్ని దెబ్బ కొట్టడం కోసమే ప్రచారాలు జరుగుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ విష ప్రచారం ప్రభావం ఎంత వరకు పనిచేస్తుంది అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: