దాదాపుగా ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వల్ల అత్యంత దయనీయమైన పరిస్దితులను ఎదుర్కొంటుంది.. ఈ వైరస్ వల్ల రోజు రోజుకు బ్రతికి బట్టకట్టెవారు కరువవుతున్నారు.. ఎన్ని ప్రాణాలు మట్టిలో కలిసిపోతున్నాయో లెక్కే లేదు. ఈ మరణాలకు ముగింపు పలకడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు.. కానీ కుటుంబాలు కుటుంబాలు అనాధల్లా మారిపోతున్నాయి.. ఏ క్షణం ఎవరిని కబళిస్తుందో తెలియక ప్రజలు అల్లాడిపోతున్నారు.. ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా పేరు వింటేనే గుండెలు ఆగిపోతున్నాయి..

 

 

ఇక ఇలాంటి పరిస్దితుల్లో రెండు రోజుల క్రితం చైనాకు చెందిన ప్రముఖ దర్శకుడు చాంగ్ కాయ్, అతని తల్లిదండ్రులు, సోదరి మరణించారు. అతని భార్య చావుల బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఇకపోతే జనవరి 25న, చైనీస్ లూనార్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా, చాంగ్ కాయ్ తన కుటుంబీకులతో గెట్ టుగెదర్ ఏర్పాటుచేసారు. ఆ సమయంలో అంతా బాగా ఎంజాయ్ చేసారు. ఆ తర్వాత నుండి వారంతా క్రమ క్రమంగా అనారోగ్యం పాలవడం మొదలుపెట్టారు.. అనుమానం వచ్చిన ఆ కుటుంబీకులు  వైద్యులను సంప్రదించగా కరోనా సోకినట్లు తెలిసింది.

 

 

వెంటనే వారందరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించడం మొదలుపెట్టారు, కానీ అప్పటికే కరోనా తాలూకు ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడంతో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉండగా చాంగ్ కుమారుడు యూకేలో చదువుకుంటున్నాడు. తన కుటుంబం మొత్తం కరోనాకు బలైపోయిందని తెలిసీ అతను ఏమీ చేయలేని పరిస్థితి. కనీసం తండ్రిని చివరిసారిగా చూసుకునే వీలు కూడా లేకుండా యూకే అధికారులు చాంగ్ కుమారుడిని చైనాకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.

 

 

అతను వెళ్తే తనకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని, అతను మళ్లీ యూకేకు వస్తే అక్కడి ప్రజలకు కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందని ప్రభుత్వం అనుమతించలేదు.. నిజంగా ఇదెంత దయనీయమైన దుస్దితి కళ్లముందు తనను కన్న వాళ్లు మరణించిన గాని చూడలేని పరిస్దితి. ఇక ఇలాంటి కష్టాలను చైనాలో ఎన్నో కుటుంబాలు అనుభవిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: