చంద్రబాబునాయుడు దెబ్బకు తెలుగుదేశంపార్టీ నేతలు భయపడిపోతున్నారు. బుధవారం నుండి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికిప్పుడు అంత అవసరం ఏమొచ్చిందంటే వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాల్లో అవగాహన కల్పించటానికని చంద్రబాబు చెబుతున్నారు. వైసిపి అరాచక, అసమర్ధ, అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబు చాలా బలంగా నమ్ముతున్నారు.

 

నిజానికి చంద్రబాబు చెప్పిందే నిజమైతే  అసలు చంద్రబాబు జనాల్లో చైతన్య యాత్రలు చేయాల్సిన అవసరమే లేదు. జగన్ పై జనాల్లో అంత తీవ్రంగా అసంతృప్తి ఉంటే వాళ్ళే ప్రభుత్వంపై తిరగబడతారన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో ప్రజల్లో అంత తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోవాల్సిన అవసరం కూడా అంతగా లేదనే చెప్పాలి. ప్రజలకు నేరుగా ఎఫెక్ట్ అయ్యే ఇసుక లేకపోతే అన్న క్యాంటిన్ల మూసివేత లాంటి ఒకటి రెండు అంశాల్లో మాత్రమే జనాల్లో అసంతృప్తి ఉంది.  వర్షాలు, వరదలు తగ్గగానే ఇసుక సరఫరా విషయంలో ప్రభుత్వం బాగానే చర్యలు తీసుకుంది.

 

అదే సమయంలో ఒకటికి పది సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో మెజారిటి జనాల జగన్ పాలనలో  హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడో ఒకచోట తప్పులు జరుగుతునే ఉంటాయి వాటిని సవరించుకుని ప్రభుత్వం ముందుకు పోతుంటుంది.  ఈ నేపధ్యంలోనే  చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలంటే టిడిపి నేతలు భయపడిపోతున్నారు. చాలామంది నేతల అభిప్రాయం ప్రకారం జనాల్లో జగన్ ప్రభుత్వంపై ఇంకా వ్యతిరేకత పెరగలేదు.

జనాల్లో లేని వ్యతిరేకతను టిడిపి పెంచాలంటే సాధ్యంకాదు. పైగా చంద్రబాబు టూరంటే భారీగా ఖర్చవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల దెబ్బకు పార్టీ నేతలంతా కుదేలైపోయున్నారు. ఈ సమయంలో మళ్ళీ అంతంత ఖర్చులంటేనే నేతలు భయపడిపోతున్నారు. పైగా ఇప్పటికిప్పుడు యాత్రలు చేసి ఉపయోగం కూడా ఏమీ ఉండదు. మహా అయితే స్ధానిక సంస్ధలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చైతన్య యాత్రను పెట్టుకున్నారేమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: