పవన్ వేస్తున్న రాజకీయ అడుగులు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల లోనే కాకుండా ఆయన పార్టీలో ఉన్న కీలక నేతల్లోనూ సరైన సదాభిప్రాయం ఉండడం లేదు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. పవన్ చేస్తున్న రాజకీయాలు ప్రజల్లో నమ్మకాన్నిపెంచకపోగా అనేక అనుమానాలు వ్యక్తం అవ్వడానికి కారణం అవుతున్నాయి. దీని కారణంగానే పవన్ కు ఏపీలో ఎవరికీ లేనంత స్థాయిలో పలుకుబడి ఉన్నా రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్న చాలా మంది కీలక నేతలు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. ఇక మిగిలి ఉన్న నాయకులు కూడా చాలా అసంతృప్తిగానే ఉన్నారు. 


ఇక ఇప్పుడు జనసేనలో ఉన్న మరో కీలక నాయకుడు అసంతృప్తి బయటకు వచ్చింది. జనసేన పార్టీలో పవన్ తర్వాత ఆ స్థానంలో ఉన్నది నాదెండ్ల మనోహర్ అన్న విషయం అందరికీ తెలుసు. సీనియర్ నాయకుడిగా గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా,ఉప సభాతిపతిగా, సభాధిపతిగా పనిచేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ప్రాధాన్యం కోల్పోయిన తరువాత నాదెండ్ల సైలెంట్ గా ఉండిపోయారు. అప్పట్లో ఆయనకు అనేక పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా మనోహర్ జనసేనలోనే చేరారు. ఇక అప్పటి నుంచి పార్టీలో నాదెండ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తునాన్రు పవన్.  2019 ఎన్నికల్లో టీడీపీతో లోపాయికారిగా...  బీఎస్పీ, వామపక్ష పార్టీలతో పొత్తులు పెట్టుకునేలా చేసింది మనోహర్ అన్నది కొద్ది మందికి మాత్రమే తెలుసు. 


పవన్ ఎక్కడికి వెళ్ళినా పక్కన నాదెండ్ల మనోహర్ ఉండాల్సిందే. అయితే కొద్ది రోజులుగా మాత్రం పవన్ పక్కన ఆయన కనిపించడం లేదు. తాజాగా పవన్ అమరావతి పర్యటనకు నాదెండ్ల హాజరుకాలేదు. అయితే అనారోగ్య కారణాల వల్లే పవన్ పర్యటనకు మనోహర్ హాజరు కావడం లేదని చెబుతున్నా అసలు కారణాలు వేరే ఉన్నట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా పవన్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో మనోహర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అది కాకుండా గతంలో తాను పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని.. సినిమాల్లో నటించనని చెప్పి ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వెళ్లడం ,పవన్ నిర్ణయం కారణంగా పార్టీ కేడర్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని... పార్ట్ టైం పాలిటిక్స్ అనే విమర్శలు వస్తాయని పవన్ కు పదేపదే చెప్పినా పవన్ నుంచి పెద్దగా స్పందన లేదట. 


అందుకే ఇప్పుడు ఆయన పార్టీకి దూరంగా ఉన్నట్లు గా వ్యవహరిస్తున్నారు. పవన్ నిలకడలేని విధానాలు.. విశ్వసనీయత లేని మాటలు ఇవన్నీ రాజకీయాల్లో పనిచేయవని, పవన్ తో పాటు తాను కూడా ఆయన వెంటే ఉంటే తన పొలిటికల్ కెరియర్ కూడా దెబ్బతింటుందనే ఆలోచనకు వచ్చిన నాదెండ్ల జనసేన కు బై బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయనకు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా చేరలేదు ప్రస్తుతం ఆయన వైసీపీలోకి కానీ, బీజేపీలోకి కానీ వెళ్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: