కరీంనగర్ లో జరిగిన కారు ప్రమాదం వ్యవహారంపై ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబం తీరుపై ఇప్పుడు పలువురు వ్యక్తం చేస్తున్నారు.  గత నెల 28 నుంచి రాధిక కుటుంబం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అదే విషయాన్ని ఫెర్టిలైజర్ షాపులో పని చేసే ఒక నర్సింగ్ ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వెంటనే ఇంటికి వెళ్ళిన ఎమ్మెల్యే కుటుంబం ఇంటి తాళాలు పగలకొట్టి ఎవరూ లేరు అని తెలిసి కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రియల్ ఎస్టేట్, ఫెర్టిలైజర్ వ్యాపారాలు చేస్తున్న రాధిక కుటుంబం తరుచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని ఎమ్మెల్యే కుటుంబం చెప్తుంది. 

 

దీనితో ఇప్పుడు వ్యవహారం కొత్త మలపులు తిరుగుతుంది. అసలు ఎందుకు 22 రోజులుగా పోలీసులకు ఎమ్మెల్యే కుటుంబం ఫిర్యాదు చేయలేదని ప్రశ్నలు వినపడుతున్నాయి. అయితే అసలు పోలీసులకు సమాచారం ఇచ్చారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. భర్త సత్యనారాయణ రెడ్డి తో ఎమ్మెల్యే కి ఎలాంటి విభేదాలు లేవని, కుటుంబ విభేదాలు కూడా లేవని అంటున్నారు. కాగా సోమవారం ఉదయం, కరీం నగర్ కాకతీయ కెనాల్ లో ఒక గుర్తు తెలియని కారుని అక్కడి స్థానికులు గుర్తించిన సంగతి తెలిసిందే. 

 

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చి చూసిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఎమ్మెల్యే బావ సత్యనారాయణ రెడ్డి కుటుంబంగా గుర్తించారు. మూడు శవాలు కారులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. దీనితో అసలు కారు ప్రమాదం జరిగిందా లేక వాళ్ళు ఆత్మహత్య ఏమైనా చేసుకున్నారా...? అప్పుల వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా...?? రాజకీయ కోణం ఏదైనా ఉందా...? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు ప్రాధమిక విచారణలో మాత్రం కారు ప్రమాదానికి గురైందని గుర్తించారు. వేగంగా రావడం తోనే కాలవలోకి వెళ్ళిపోయినట్టు తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: