కేటీఆర్ హవా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఇప్పుడు మామూలుగా లేదు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీ మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక తొందర్లోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండడంతో పాటు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తుండడంతో కేటీఆర్ త్వరలోనే సీఎంగా బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఒక్కసారిగా సీఎంగా బాధ్యతలు అప్పగిస్తే కేటీఆర్ కాస్త కంగారు పడతారు అనే ఉద్దేశంలో ఉన్న కేఈసీఆర్ ఇప్పటి నుంచే   ఆయనకు అనుకూలంగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. ప్రస్తుతం మంత్రిగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ గా ఆయన పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు సంపాదించుకోవడంతో ప్రభుత్వంలోనూ కేటీఆర్ హవా కనిపించేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.


 సోమవారం జరిగిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. మొత్తం కెసిఆర్ పుట్టినరోజు వ్యవహారం అంతా కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కేటీఆర్ ఆధ్వర్యంలో విజయం సాధించడంతో చైర్మన్, మేయర్, సర్పంచ్ పదవులను కూడా కేటీఆర్ కు నచ్చిన వారికి కేసిరారు కట్టబెట్టారు. ఇక ప్రభుత్వం నుంచి చేపట్టబోయే పదవుల్లోనూ కేటీఆర్ కు నచ్చిన వారికే ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కేటీఆర్ కు ఎటువంటి ఇబ్బందులు రావని.. ఆయన మాట వినేవారే పదవుల్లో ఉంటారు కనుక ఆయన మాటే చెల్లుబాటు అవుతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. 


పార్టీలోను.. ప్రభుత్వంలోను ఎవరికైనా నియామకాలు కలవాలంటే కేటీఆర్ ని సంప్రదించవలసినదిగా ఇప్పటికే కెసిఆర్ పార్టీలోని కొంతమంది పెద్దలకు సూచించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ సూచించినవారిలో కేసీఆర్ కు ఇష్టంలేని వారు ఉన్నా కేటీఆర్ సూచించాడు కాబట్టి వారికి పదవులు కట్టబెడుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల కేటీఆర్ హవా పెరుగుతుందని, త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఎటువంటి ఇబ్బందులు ఉండవని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కేటీఆర్ కూడా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన పరపతి పెరిగే విధంగా షాడో సీఎం గా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: