ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఐటీ దాడుల వ్యవహారం కాకా రేపుతోంది. 2020 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మొత్తం 40 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మూడు ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. అధిక బిల్లులు, బోగస్ బిల్లులతో బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిపిన రాకెట్ గుట్టు రట్టయింద‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో కూడా ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి విదితమే. 

 

దీంతో అసల అక్క‌డ దొరికిందేన్తో కూడా పూర్తి వివరాలు బయటకు రాకముందే వైసీపీ వర్గాలు 2వేల కోట్లు దొరికాయని ప్రచారం చేయసింది. దాన్ని ఖండిస్తూ టీడీపీ వారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి.. అక్క‌డ కేవ‌లం రూ.2లక్షల 63 వేలని చెప్పింది. అలాగే ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్ట్‌ను కూడా బయటపెట్టారు తెలుగు తమ్ముళ్లు. వైఎస్సార్‌సీపీ తమ అధినేతపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 

 

ఈ క్ర‌మంలోనే తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. చంద్ర‌బాబుపై ఐటీ రైడ్స్ వ్యవహారంలో మ‌రో సారి విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి ఎల్లో మీడియా కిందా మీదా పడుతోంది అని విజయసాయి రెడ్డి విమర్శలు చేసారు. ఇన్ కం టాక్స్ కమిషనర్ ని కూడా దూషించేస్తాయికి వెళ్లిపోయిందని విజయసాయి రెడ్డి అన్నారు. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది అంటూ విజయసాయిరెడ్డి మండిప‌డ్డారు. 

 

అయితే ఈయ‌న విమ‌ర్శ‌ల‌కు నెటిజ‌న్లు కూడా అదే స్థాయిలో కౌంట‌ర్ ఇస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి ఫేక్ న్యూస్ చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు అంటూ విజ‌య‌సాయిరెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నారు నిటిజ‌న్లు. అయితే ఇటీవ‌ల రెండు వేల కోట్ల‌ను కేవ‌లం ఉల్లిపాయ పొర‌తో పోల్చిన ఈయ‌న నేడు చంద్ర‌బాబును ప‌త్తిగింజ‌తో పోల్చ‌డంతో కాస్త అసంతృప్తి వ్య‌క్తం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: