గత టీడీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి వ్యవహారాలు, అధికార దుర్వినియోగం జరిగినట్టుగా జరుగుతున్న ప్రచారానికి సూచికగా ఏపీలో తెలుగుదేశం పార్టీ కీలక నాయకులే లక్ష్యంగా ఐటీ, ఈడీ అధికారుల ఆధ్వర్యంలో టీడీపీకి సంబంధించి అవినీతి అర్పణలు ఎదుర్కుంటున్న వారి ఆస్తులపై వరుసగా అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల సందర్భంగా అనేక అవినీతి, అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలను బయటపడుతూ ఉండడంతో కొంతకాలంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అందుకే ఏపీలో జరుగుతున్న పరిణామాలు తనకు సంబంధం లేదు అన్నట్టుగా ఆయన  ఆయన అందుబాటులో లేకుండా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. 


ఇప్పటికే చంద్రబాబు నాయుడు కు సంబంధించి కొన్ని అవినీతి ఆధారాలు దర్యాప్తు సంస్థలు సంపాదించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీద ముందు ముందు చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నట్లుగా వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా దీనిపై స్పందించారు. ఈ మేరకు ఐటీ శాఖ కూడా ఆయన సలహా ఇచ్చారు. చంద్రబాబునాయుడు పాస్ పోర్ట్ వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయన అధికారులను కోరారు. 


చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ రైడ్స్ జరగడంతో అనేక అక్రమాస్తులు బయటపడ్డాయని, అందుకే చంద్రబాబు విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నట్లుగా రాజా అనుమానం వ్యక్తం చేశారు. ముందస్తుగా చంద్రబాబు పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆయన సూచిస్తున్నారు. ఇప్పటికే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటివారు భారీ ఆర్ధిక కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పారిపోయారని చంద్రబాబు కూడా ఆ విధంగానే పారిపోయే అవకాశం ఉన్నట్లుగా రాజా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: