దేశ‌వ్యాప్తంగా మార్చిలో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడి ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కూడా నాలుగు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఆ నాలుగు సీట్లు వైసీపీకి ద‌క్క‌నున్నాయ‌. వైసీపీ సంఖ్యా బ‌లం 151. దీంతో ప్ర‌తిప‌క్షాల‌కు ఒక్క సీటు కూడా ద‌క్కే ఛాన్స్ లేదు. అస‌లు ప్ర‌తిప‌క్ష టీడీపీ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఛాన్స్ కూడా లేదు. ఈ నాలుగు సీట్లు వైసీపీకే దక్క‌నుండ‌డంతో జ‌గ‌న్ ఎవ‌రెవ‌రికి రాజ్య‌స‌భ సీట్లు ఇస్తార‌న్న‌ది కూడా ఆస‌క్తిగా మారింది.

 

ఈ సీట్ల‌లో ఒక సీటు త‌మ‌కు ఇవ్వ‌మ‌ని బీజేపీ అడుగుతోంద‌ట‌. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్‌ను బీజేపీ పెద్ద‌లు రాజ్య‌స‌భ సీటు గురించి అడిగార‌ట‌. గ‌తంలో టీడీపీ - బీజేపీ క‌లిసి ఉన్న‌ప్పుడు కూడా బీజేపీ ఆ ఛాన్స్ రెండుసార్లు వాడుకుని రెండు సీట్లు తీసుకుంది. వాస్త‌వంగా చెప్పాలంటే రాజ్య‌స‌భలో బీజేపీకి పెద్ద బ‌లం లేదు. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చి ఆరేళ్లు అవుతున్నా పెద్ద‌ల స‌భ‌లో మాత్రం ఇంకా బీజేపీ బ‌లం పెర‌గ‌లేదు.

 

కీల‌కమైన బిల్లుల విష‌యంలో ఇత‌ర పార్టీల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. దీంతో రాజ్య‌స‌భ‌లో బ‌లం పెంచుకునే ప‌నిలో బీజేపీ ఉంది. ఇందులో భాగంగా ఏపీలో ఒక సీటు కోసం తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు టాక్‌. జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి కేంద్రంతో ఉన్న అవ‌స‌రాల నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌మ డిమాండ్‌కు ఓకే చెపుతార‌న్న‌న ధీమాతో కేంద్ర బీజేపీ పెద్ద‌లు ఉన్నారు. అయితే బీజేపీకి ప్రీగా రాజ్య‌స‌భ సీటు ఇస్తే జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు ఎక్కువ‌వుతాయి.

 

ఇప్ప‌టికే మండ‌లి ర‌ద్ద‌యిన నేప‌థ్యంలో ఎక్కువ మంది రాజ్య‌స‌భ ఆశావాహులు వైసీపీలో ఉన్నారు. ఉన్న నాలుగు సీట్ల‌లో ఒక‌టి బీజేపీకి ఇచ్చేస్తే తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వు. అటు బీజేపీతో జ‌గ‌న్ అంట కాగుతున్నాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అందుకే జ‌గ‌న్ ఈ విష‌యంలో బీజేపీకి ఓకే చెప్ప‌లేద‌ని టాక్‌. అయితే బీజేపీ పెద్ద‌లు మాత్రం ఈ విష‌యంలో త‌మ ప్ర‌య‌త్నాలు మాత్రం ఆప‌కుండా కంటిన్యూ చేస్తున్న‌ట్టు భోగ‌ట్టా...!

మరింత సమాచారం తెలుసుకోండి: