ఏపీలో జరిగిన, జరుగుతున్న ఐటీ రైట్స్ వ్యవహారం రోజురోజుకు ముదురుతున్నట్టుగా  కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏపీ లో జరిగిన ఐటి రైడ్స్ వ్యవహారంలో స్పష్టమైన క్లారిటీ లేకుండా పోయింది. ఐటి రైడ్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు పిఎస్ తదితరులు దగ్గర సుమారు రెండు వేల కోట్ల రూపాయల వరకు అక్రమాస్తుల వ్యవహారాలు బయటపడ్డాయని, తెలుగుదేశం వ్యతిరేకులు ప్రచారం చేస్తుండగా... టిడిపి మాత్రం రెండు వేల కోట్లు కాదు రెండు లక్షల రూపాయలు మాత్రమే అని చెబుతోంది. దీంతో అసలు రెండు వేల కోట్లా..?  రెండు లక్షల అనేది కూడా కన్ఫ్యూజన్ గా మారింది. 


కాకపోతే తెలుగుదేశం పార్టీ వారు మాత్రం ఐటి రైడ్స్ కు సంబంధించి కేవలం ఒక పేజీ మాత్రమే చూపించి రెండు లక్షలు అంటున్నారని.. ఇంకా చాలా పేజీలు ఉన్నాయని, వాటిని వెలుగులోకి రాకుండా టిడిపి కట్టుకథలు అల్లుతోందని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంలో కి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ  వ్యవహారానికి సంబంధించి చాలా కాలం కిందటే అన్ని ఆధారాలు బయటికి వచ్చాయి. నకిలీ బిల్లులు సృష్టించి కొన్ని కాంట్రాక్టు సంస్థల నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీగా లబ్ధి పొందినట్టుగా కొంత కాలం క్రితమే ఐటి అధికారులు గుర్తించారు. 


దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో ఏపీలో వాటి మూలాలు దొరికాయని, వాటి ఆధారంగానే ఏ రైడ్స్ చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో రైడ్స్ చేసేది ఐటీ నా ఈడీ నా అనేది పెద్దగా ఎవరికీ అర్ధం కాలేదు.   ఆఖరికి ఈ విషయంపై ఐటీ శాఖ స్పందించడంతో ఏపీలో జరుగుతున్నవి ఐటీ దాడులు అన్న సంగతి బయటపడింది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ప్రభుత్వ పెద్దలు భారీగా అక్రమాలు పాల్పడ్డారని, వారు తమ కమిషన్లు తీసుకునేందుకు పేపర్ల లో కాంట్రాక్టు సంస్థలను సృష్టించి పెద్ద మొత్తంలో కూడబెట్టినట్టుగా బయటపడడంతో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఈడీ దర్యాప్తు లో తేలే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: