తల్లిపాలు శిశువుకు అమృతం లాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతంది. చాలా మంది తల్లులు తమ పిల్లలకు సరిపోయేన్ని పాలు ఇవ్వలేకపోతున్నామని మధన పడిపోతుంటారు. పోతపాలకు అలవాటు చేస్తుంటారు. వారికి పోతపాలు పట్టక పడే ఇబ్బందులు చాలా ఇళ్ళలో నిత్యకృత్యాలే. ఇలాంటి సమయంలో పాలిచ్చే తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమృద్ధిగా పాలు పడతాయి. చిన్న పిల్లల తల్లులలో పాల ఉత్పత్తికి మెంతులు చాలా ఉపయోగపడుతాయి.

 


కొన్నరకాల కూర‌గాయ‌లు తిన‌డం వ‌ల్ల బాలింత‌లో పాలు స‌మృద్ధిగా ప‌డ‌తాయి. అంటే కాకర కాయ, బీరకాయ వంటివి తల్లిలో పాలు పడేందుకు బాగా ఉపయోగడుతాయి. ఈ కూరగాయల్లో అధికంగా విటమిన్స్ మరియు మిన‌ర‌ల్స్‌ ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ బాగా ఉండికించి కారం లేకుండా తల్లి తీసుకొన్నట్లైతే బిడ్డకు సరిపడా పాలు పెరుగుతాయి.

 


పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి. ఆవుపాలు, నెయ్యి, బట్టర్, వంటి వాటితో పాలు ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అయితే వీటిని పచ్చిగా అలా తీసుకోవడం కంటే వాటిని కర్రీస్ లో చేర్చి అందించడం మంచిది. కర్బూజాపండు, పాలకూర, జీలకర్ర. బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, ములగాకు కూరలు చాలా మేలు చేస్తాయి.

 

 

బాదం, జీడిపప్పు, వంటివి బ్రెస్ట్ మిల్క్ ను పెంచడంలో చాలా అద్భుతంగా పాత్ర వహిస్తాయి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్, మరియు మినిరల్స్ అధిక శాతంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చిరుతిండి.  గ్రీన్ వెజిటేబుల్స్ మరియు రెడ్ వెజిటేబుల్స్ లో ఎక్కువ శాతం ఫైబర్ కలిగి ఉంటుంది. ఆకుకూ0రలు, బీన్స్, స్వీట్ పొటాటో మరియు దుంపలు బ్రెస్ట్ మిల్క్ ను పెంచడంలో చాలా ఉపయోగపడుతాయి. కాబట్టి వీటిలో ఏదో ఒకటి ప్రతి రోజూ తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. లేదా వీటిని జ్యూసుల రూపంలో తీసుకోవడం చాలా ఆరోగ్యకరం శిశువుకు కావల్సినన్ని పాలను ఉత్పత్తి చేయడంలో బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: